#


Index

భాగవత ప్రాశస్త్యము

అని సహృదయులు ప్రశ్నించవచ్చు. నిజమే, అలాగే చేయవచ్చు. సందేహంలేదు. కాని భాగవతమనేది ఎంత వివాదగ్రస్తమైనా అది పండిత లోకంలోనే. లోకంలో మాత్రమది ఎంతగానో ప్రచారంలో ఉంది. దీనికున్నంత బహుళమైన ప్రచారం విష్ణు పురాణానికి లేదు. హరివంశానికి లేదు. అసలా మాటకు వస్తే మరి ఏ పురాణానికి కూడా లేదు. ఇతిహాసమంటే భారత రామాయణాలు - పురాణమంటే భాగవతం. ఇదే లోకంలో పిన్న దగ్గరి నుంచి పెద్ద వరకూ ప్రతి ఒక్కడి అభిప్రాయం. జనవాక్యం తు కర్తవ్యమన్నారు పెద్దలు. బహుజనాభిప్రాయాన్ని మనం కాదనటం దేనికి. ఇంతకాలం నుంచి ఇంతమంది ఆదరణకు పాత్రమైన గ్రంథాన్ని మనం త్రోసిపుచ్చటం మంచిది కాదు. అది వ్యాసప్రోక్తమో కాదో భగవానుడి కెఱుక, వ్యాసుడే రచించినా మరి ఒక అభినవ వ్యాసుడే రచించినా మనకు దానితో నిమిత్తం లేదు. అంతగా స్తనశల్య పరీక్ష కూడా మనకక్కరలేదు. ముఖమున్నది అద్దమున్నదన్నట్టు ఆ గ్రంథమున్నది లోకమున్నది. లోకానికి కావలసినదంతా దానిలో ఉన్నది. దానిలో ఉన్నదంతా లోకానికి కావలసిందే. మోక్ష పురుషార్థాన్నే బోధిస్తున్నదది. అందులో కథలన్నీ దాని కోసమల్లినవే. అవి విష్ణు పురాణంలో ఉన్నా మరొక దానిలో ఉన్నా - అవే ఇవి. ఆ గజేంద్రుడే. ఆ ప్రహ్లాదుడే. ఆ కుచేలుడే. ఆ దశావతారాలే. ఆ ధర్మ సంస్థాపనమే. అలాంటప్పుడేదైతేనేమి. విష్ణు పురాణం చదివితే నేమి భాగవతం వల్లనైనా

  చదివితేనేమి. అందులో విషయమే ఇందులో ఉన్నప్పుడేదైనా ఒక్కటే. ఏదైనా పఠన యోగ్యమే మనకు. ఒక విష్ణు పురాణమే చదువుతున్నామనుకొని చదివినా చదవవచ్చు గదా. మన మాస్తికుల మయినప్పుడు మనకు కావలసింది భగవత్తత్త్వ విజ్ఞానమయినప్పుడు అందుకోవలసింది ఎప్పటికైనా జీవిత పరమావధి అయిన సాయుజ్య మయినప్పుడు ఏదైతే నేమి నష్టం. అసలీ పురాణాలూ కథలూ - అన్నీ కల్పితమే గదా. భగవత్సాయుజ్య ప్రాప్తి కది ఒక సంకేతమూ ఒక ఆలంబనమేననే గదా ప్రతిపాదించాము. అది దేనివల్ల ఒన గూడితే మనకది ప్రామాణికం. ఒనగూడదో అది అప్రామాణికం. ఈ సూత్రాన్ని బట్టి చూస్తే విష్ణు పురాణాదుల లాగా భాగవతమూ మనకు ప్రామాణికమే.

  అయితే కొన్నివైరుద్ధ్యాల మాటేమిటని అడగవచ్చు. అది మనం వ్యాఖ్యానించటం లోనూ సమన్వయించటంలోనూ ఉంటుంది. చక్కగా అర్థం చేసుకొని సమన్వయిస్తే

Page 41

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు