
 
 
                                    
మనపాలిటికి. అది సాంబుడి గర్భంలో నుంచి రాగానే వారెలా హడలిపోయారో అలాగే హడలిపోతున్నా మీ సామగ్రి శాస్త్రకారుల బుద్ధి కుహరంలో నుంచి రాగానే. దానిని తప్పించుకోటానికి వారు పొడి చేసి సముద్రంలో కలిపినా అది సమసిపోలేదు మీదు మిక్కిలి ఒక తుంగ మాదిరి తీరంలో మొలచి వారికోసం కనిపెట్టుకొనే ఉంది. అలాగే ఈ ఆయుధాలను కూడా ఎలా రూపుమాపాలని చూచినా పోవటం లేదు. అంతకంతకు వాటి సంఖ్య ఎక్కువవుతూ అవన్నీ మన అంతిమ సమయం కోసం కనిపెట్టుకొనే ఉన్నాయా అని భయం వేస్తుంది. 
అసలు జాతి సురక్షితంగా ఉండాలంటే ప్రతివ్యక్తి తన ధర్మాన్ని తాను పాటిస్తూ పోవాలి. అలా పాటించాలంటే దేశాన్ని పాలించే ప్రభువులు అందరూ ధర్మాన్ని పాటించేలాగా చూడాలి. చూడాలంటే వారు ముందు ధర్మమార్గాన్ని తప్పకుండా అనుసరించాలి. “రాజా కాలస్య కారణం యధా రాజా తథా ప్రజా” అన్న సుభాషితాలిందు కోసమేర్పడ్డవే. ఈ సూత్రం తెగిపోయినప్పుడే జాతికంతటికీ ముప్పు. అది కూడా మనకు భాగవతమే తత్తత్కథా వ్యాజంతో బయట పెడుతున్నది. పృథు చక్రవర్తి తండ్రి అయిన వేనుడి కథ ఇలాంటిదే. ప్రజాక్షేమం చూడవలసిన పదవిలో ఉండి కూడా అతడు తన బాధ్యత మరచాడు. మరవటమే గాక స్వార్థపరుడయి ప్రజలను బాధించాడు. నిరంకుశంగా పాలన సాగించాడు. నేనే ఈశ్వరుణ్ణి నాకంటే వేరెవడూ లేడు నియంత అని లోకానికి చాటాడు. అతడి దర్పమూ దౌర్జన్యమూ సహించలేక ప్రజలు తహ తహ లాడారు. చివరకు మహర్షులు కలగజేసుకొని వారించినా వాడు వారి మాటలు నిర్లక్ష్యం చేస్తాడు. దానికి కోపించి వారు తమ తపశ్శక్తితోనే వాణ్ణి దగ్ధం చేశారు. ఏమిటీ కథ. 
 
  ఈనాటి వ్యవహారమే ఇదంతా. ఇప్పుడూ ఉన్నారు వేనుడి లాంటి నిరంకుశ పాలకులు. స్వార్థిక పరాయణులు. ప్రజాకంటకులు. సజ్జనులైన మేధావుల మాట వీరు పెడచెవిన పెడుతున్నారు. ఎప్పుడో ఒకసారి ఏ పర్వతారణ్యాలలోనో తపోదీక్షతో నివసిస్తున్న మహాత్ముల దివ్యశక్తులు వీరిని నిలువునా నీఱుచేసి తుదముట్టించటం ఖాయం. 
 
  ఇలా ఒకటి గాదు. ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు. రాక్షసులు దేవతలనూ, ఋషులనూ పెట్టే ఆగడాలన్నీ సాధువులనూ, మేధావులనూ దుర్మార్గచరులైన  
Page 401
 బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు