#


Index

భాగవతము - సందేశసారము

పాలకులూ వారి ఆసరాతో వర్తించే దుండగులూ, పెట్టే వ్యవహారానికి నిదర్శనమే. దక్షాదుల అవివేక చర్యలన్నీ కేవల కర్మిష్ఠుల అజ్ఞానానికీ అహంకారానికీ తార్కాణమే. నహుషాదుల కథలన్నీ అకాలంగా అయోగ్యులకు ఉన్నత పదవులు లభిస్తే వారు కన్ను మిన్ను గానక నడచుకొనే వ్యవహారమే. కడకు అకారణంగా సాధువులకు దుర్వాసః ప్రభృతులు శాపాదులిచ్చినట్టు వర్ణించటం కూడా మంత్ర తంత్రాదులచేత క్షుద్ర శక్తులను సాధించి వాటిని దుర్వినియోగం చేసే వారి అనుచిత వర్తనమే. ఇలా భాగవత కథలన్నీ బాగా తరచి చూస్తే మనకప్పుడెప్పుడో జరిగిందనే గాదు. ఇప్పటి లోకవ్యవహారం కూడా కండ్లకు కట్టినట్టు కనిపిస్తూనే ఉంది. అసలీ కథలన్నీ కల్పనలనే గదా పేర్కొన్నాము. కొందరు చక్రవర్తుల కథలూ, వారు నివసించిన ప్రాంతాలూ, నదీ పర్వతారణ్యాదులూ, చారిత్రకంగా సత్యం కావచ్చు. అలాటి సత్యం పది శాతమైతే మిగతా తొంబది శాతం దానిమీద చేసే ఒక బ్రహ్మాండమైన కల్పన. అయితే ఏ కథ చెప్పినా అది ఏదో ఒక జీవిత సత్యాన్ని బయట పెట్టటానికే. అది అప్పుడే గాదు. ఇప్పుడూ సత్యమే. సార్వకాలికమే. పింగళ అనే వేశ్యవృత్తాంతమూ, అజగర వృత్తాంతమూ, ఇలాటివెన్నో మనకీ విషయంలో అద్భుతమైన ఉదాహరణలు. ఇలాంటి నిత్య సత్యాలను మనకందిచ్చి మనలను బాగుచేయటానికే పురాణ మవతరించింది లోకంలో. అదే దాని పురాణవత్వం. పురాణత్వం.

  ఇంతకూ మానవజాతి తన ధర్మాన్ని తప్పకుండా జీవించినప్పుడే దాని కభ్యుదయం. లేకపోతే వినిపాతం తప్పదు. అది ఆయా యుగాలలో క్రమంగా లోపించినప్పుడే ప్రళయం సంభవించింది. కృతంలో నాలుగవ పాదంలో తప్పితే అది త్రేతలో మూడవపాదంలో అయితే, ద్వాపరంలో రెండుకయితే, ఇప్పుడీ కలిలో అది మొదటికే మోసం తెచ్చింది. కలియుగారంభంలోనే అది ఒక ప్రబలమైన వ్యాధిలాగా ప్రవేశించింది. ధర్మాన్ని కూలదన్నింది. దానితో అతివృష్టి, అనావృష్టి, భూకంపాలూ, అన్యోన్యకలహాలూ, దారుణ హత్యలూ, మానభంగాలూ, మారణాయుధాలూ, ఎక్కువయి నేలతల్లి ఫలించకుండా వట్టిపోయింది. ఎంత పరీక్షిత్తయినా దుష్టశక్తుల నుపేక్షిస్తే సంభవించే ఉపద్రవమిది. అది చివర కజ్ఞాతంగా అతనిలోనే ప్రవేశించి అతణ్ణి నిర్మూలిస్తుంది. సచ్ఛీలురైన ప్రభువు లంతరిస్తే, చివరకు ప్రాప్తించేది మనకు మ్లేచ్ఛపాలనమే. దానితో ధర్మం లేదు. భాగవత ధర్మానికేమి

Page 402

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు