#


Index

భాగవతము - సందేశసారము

సమాప్తమయింది. ద్వాపరం కౌరవ పాండవుల పోరాటంతో ముగిసింది ఒకటి దేవతలూ రాక్షసుల మధ్య. మరొకటి మానవులూ రాక్షసుల మధ్య. ఇంకొకటి మానవులూ మానవుల మధ్య. ఎక్కడ ఉన్నారీ దేవదానవ మానవులు. మనలోనే మన మానవ సమాజంలోనే. మనలో ఉన్న త్రిగుణాలకు ప్రతీకలే వీరు. ఈ గుణ సంక్షోభమ ఒక సంగ్రామం. వాటి సామరస్యమే వ్యవస్థ. అలాటి సామరస్యం రజస్తమో మాలిన్యం క్షాళనమై సత్త్వం బాగా పరిశుద్ధమైతే గాని ఏర్పడదు.

  అదే ఇప్పుడీ కలియుగంలోనూ దెబ్బ తిన్నది. ఆ దెబ్బ తిన్న లక్షణాలే ఇంతవరకూ ఏ కరువు పెట్టింది. ఇది తారస్థాయికి చేరుకోటానికిక ఎంతో దూరం లేదని కూడా చెప్పాము. ఇది మన ఊహాగానమే గాదు. నేటి శాస్త్రజ్ఞులు కూడా ఇలా ప్రవచిస్తున్నారు. దైవజ్ఞులు కూడా సూచిస్తున్నారు. ప్రాజ్ఞులైన పెద్దలకు కూడ అలాగే తోస్తున్నది. దీనికి తగినట్టు ఆయా దేశాలవారు దారుణమైన మారణాయుధ సామగ్రి లెక్కకు మిక్కిలిగా పోగుచేసుకొని కూచున్నారు. అణు పరిశోధన లద్భుతంగా సాగుతున్నాయి. అంతరిక్షయానాలు గ్రహాంతర పరీక్షలు చెప్పనలవి గాదు. లక్షల కోట్ల మందిప్రాణులను త్రుటిలో పుటమార్చి బూడిద చేసే చిత్ర విచిత్ర యంత్ర పరికరాల కంతులేదు. అంతా సిద్ధంగా ఉంది. అవి ఇక మీట నొక్కి ప్రయోగించటమే తరువాయి. దానికి బుద్ధి పుట్టటమే ఆలస్యం. ఆ బుద్ధికి కామక్రోధాదులొకటి పెల్లుబికితే చాలు. అది ప్రపంచ మానవుల కర్మ విపాకాన్ని బట్టి. దానికి దైవ సంకల్పం తోడు కావాలి. అయితే ఇక క్షణమాగదు. పూర్వంలా దీర్ఘకాల సంగ్రామంతో కూడా పనిలేదు. ఎక్కడి ప్రాణి అక్కడే హతం హతమైతే ఆ క్షణం నుంచీ ఇక కృతమే.

  సంపూర్ణమైన పరివర్తనమే రావాలంటే ఎప్పుడు గానీ జాతి బాగా అధః పతనమై మరలా దానిపాటికది పైకి లేవాలి. ఈ విశ్వ సత్యాన్నే హరి వంశంలో ఇలా బయట పెట్టాడు వ్యాసభట్టారకుడు.

శీల వ్యసన మాసాద్య - ప్రాపస్స్యంతే హ్రాస మాయుషః ఆయుర్హాన్యా బలగ్లానిః - బలగ్లాన్యా వివర్ణతా వైవర్ణ్యాద్వ్యాధి సంపీడా - నిర్వేదో వ్యాధి పీడనాత్ నిర్వేదా దాత్మ సంబోధః - సంబోధాద్ధర్మ శీలతా ఏవమ్ గత్వా పరాంకాష్ఠామ్ - ప్రపత్స్యంతి కృతం యుగమ్

Page 398

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు