చౌర్యానృత వృధా హింసా నానా వృత్తిషు వైనృషు
శూద్రప్రాయేషు వర్ణేషు - ఛాగ ప్రాయాసు ధేనుషు
గృహప్రాయేష్వాశ్రమేషు - యౌన ప్రాయేషుబంధుషు
అణుప్రాయా స్వోషధీషు - శమీ ప్రాయేషు స్థాన్నుషు
విద్యుత్రాయేషు మేఘేషు - శూన్య ప్రాయేషు సద్మసు
ఇత్థమ్ కలౌ గతప్రాయే - జనేషు ఖర ధర్మిషు
ధర్మ త్రాణాయ సత్త్వేన భగవా నవత రిష్యతి
ఈ విధంగా కలికాల ప్రభావం మూలంగా మానవుల శరీరాలు క్షీణించిపోతూ వర్ణాశ్రమ ధర్మాలు నశిస్తూ, పాషండ ధర్మమే ధర్మమై, రాజులంతా దొంగలై, దోపిడులూ దొంగతనాలూ, దారుణమైన
హత్యలూ వీటితో ప్రాణికోటి నానా తెరువులు పట్టిపోగా, మానవులంతా శూద్రులైపోయి, ధేనువులన్నీ మేకలూ గొఱ్ఱలలాగా మారిపోయి, ఆశ్రమాలు వైభవోపేతమైన భవనాలయిపోయి, యోని సంబంధమే బాంధవ్యమయి, ఓషధులూ వనస్పతులూ వ్రేలెడు పరిమాణమై, మేఘాలు మెరవటం తప్ప కురవటమే లేకుండా పోయి, ఊళ్లూ పల్లెలు పాడుపడ్డ బీడులయి పోతాయి చివరకు.
చివరకనేది ఏదోగాదు. ఇప్పుడే ఆ కాలం వచ్చిందా అని భయం వేస్తుంది మనకు. సరిగా ఇలాటి వైపరీత్యాలే ఉన్నాయి చాలా వరకిప్పుడు. పోతే పైన వర్ణించినట్టు జనులు కేవలం గాడిదలలాగా బ్రతుకుతూ అసలే వర్షాలు లేక అణుప్రాయంగా పైరుపంటలు మారిపోయే రోజులింకారాలేదని సంతోషించవలసిందే మనం. అవీ ఎంతో దూరం లేదు. త్వరలోనే కొన్ని దశాబ్దాలలోనే దాపురించినా ఆశ్చర్యం లేదు. వస్తే ఏమవుతుంది. ఏమవుతుందో అదీ భాగవతమే చెబుతున్నది మనకు. సత్త్వహరమైన ఈ కలియుగానికి స్వస్తి చెప్పి మరలా కృతయుగ ధర్మాన్ని ప్రవర్తింపజేయటానికా భగవానుడు సత్త్వ ప్రధానుడై అవతరిస్తాడట. మొదటినుంచీ జరుగుతూ వచ్చిందదే గదా అసలు. ఒక యుగం ముగిసిపోయేది ప్రళయంతోనే. ఆ ప్రళయం ఒక భయంకరమైన సంగ్రామంతోనే. కృతయుగం దేవదానవ సంగ్రామంతో అంతరించింది. త్రేతాయుగం రామ రావణ యుద్ధంతో
Page 397