#


Index

భాగవతము - సందేశసారము

శిష్టుడే. అది లేకుంటే శిష్టుడైనా వాడు దుష్టుడే. "స్వీకార ఏవచో ద్వాహే" ఎవడి కేపిల్ల మీద దృష్టి పడితే వాడు దాన్ని స్వీకరించవచ్చు. "సభ్యత్వే ధార్హ్య మేవహి” దబాయించగలవాడికే ఎక్కడైనా సభా మర్యాద.

  పోతే “దాక్ష్యం కుటుంబ భరణే” ఎవడి కుటుంబాన్ని వాడు పోషించుకోటమే గొప్ప. “యశోర్థే ధర్మ సేవనం” పదిమందీ మెచ్చుకోవాలనే ఏ ధర్మమైనా అనుష్ఠించటం. "బ్రహ్మవిట్ క్షత్ర శూద్రాణాం యోబలీ భవితా నృపః" నాలుగు వర్ణాలలో ఎవడ కెక్కువమందీ మార్బలముంటే వాడే ప్రజలచే ఎన్నుకోబడి వారికి పాలకుడవుతాడు. “వాక్శౌర్యం వ్యావహారికే” లోకుల అన్యోన్య వ్యవహారాలలో నోరున్న వాడిదే మాట. “విప్రత్వే సూత్రమేవచ" ఎవడు జందెం వేసుకొంటే వాడే బ్రాహ్మణుడు. “దూర వార్యయనం తీర్థం." ఎంత దూరాన నీరు కనిపిస్తే అదే గొప్ప తీర్థం. “లావణ్యే కేశ ధారణమ్” ఆడా మొగా తేడా లేకుండా జుట్టు పెంచకోటమే లావణ్యం. చివరకు "శాక మూలామిష క్షాద్ర ఫల పుష్పార్షిభోజనః” కాయలూ, కూరలూ, విత్తనాలూ, దుంపలూ ఏది దొరికితే అది తింటూ "అనా వృష్ట్యా వినంక్ష్యంతి యాస్యంతి గిరి కాననమ్” అనావృష్టితో పంటలు లేక అలమటించి పోతూ అరణ్య పర్వతాదులకు పడిపోవలసి వస్తుంది.

శీత వాతా తప ప్రాపృడ్భీమై రన్యోన్యతః ప్రజాః క్షుత్తృద్భ్యాం వ్యాధిభిశ్చైవ సంత ప్స్యంతేచ చింతయా

  శీతవాతాది ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నిరంతర చింతలతో వంతలతో కుమిలి కుమిలి కమిలిపోతారు మానవులు. పోతే ఏముంది. "తతోర్థ కామాభి నివేశితాత్మనాం – శునాం కపీనా మివ వర్ణ సంకరః" అర్థకామాలొకటే జీవిత లక్ష్యమయిపోయి దానితో కుక్కలు కోతుల మాదిరి స్త్రీ పురుషులు స్వైర విహారం చేయసాగుతారు. “త్రింశ ద్వింశతి వర్షాణి పరమాయుః కలౌనృణాం" ఇరవయి ముప్పయి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బ్రతికే ఎత్తు మానం లేదు.

క్షీయమాణేషు దేహేషు దేహినాం కలి దోషతః వర్ణాశ్రమ వతాం ధర్మే - నష్టే వేద పథే నృణాం పాషండ ప్రచురే ధర్మే - దస్యుప్రాయేషు రాజసు

Page 396

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు