చేసే ఘనకార్యం. ఎంత కళ్లకు కట్టినట్టు వర్ణిస్తున్నదో చూడండి పురాణం. అందుకే పురాణమన్నారు దాన్ని. పూర్వమెప్పుడో వ్రాసింది అయినా ఇప్పటి పరిస్థితులు పూర్వమే ఎలా చూచి వ్రాయగలిగారని అడుగుతారేమో. అదే త్రికాలజ్ఞులైన మహర్షుల విశిష్టత. త్రికాలజ్ఞులు గనుకనే వారు క్రాంత దర్శనంతో దర్శించగలిగారీనాటి సంఘటనలు కూడా. లేకుంటే ఇంత సూటిగా వర్ణించటమనేది పొసగదు.
ఒక్క పాలకుల వ్యవహారమే గాదు. పాలితులైన ప్రజల వ్యవహారం కూడా ఎలా వర్ణించారో చూడండి
తన్నాథాస్తే జానపదాః - తచ్ఛీలా చార వాదినః అన్యోన్యతో రాజభిశ్చ క్షయం యాప్యంతి పీడితాః
పౌరజానపదులందరూ అలాటి వారి ఏలుబడిలో ఎలా బ్రతకాలో అలాగే బ్రతుకుతుంటారు. “యథా రాజా తథా ప్రజాః” అలాటి స్వభావాలే. అలాటి ప్రవర్తనలే అలాటి మాటలే. చివరకా పాలకులచేత కొంతా తమలో తాము కొంతా కుమ్ము సుద్దులాడుకొని పాడయిపోతారు. పాడయిపోక ఏముంది.
తతశ్చా సుదినం ధర్మం స్సత్యం శౌచంక్షమా దయా కాలేన కలినా రాజన్ - సంక్ష్య త్యయు ర్బలమ్ స్మృతిః
కలి బలం పుంజుకొనే కొద్దీ సత్యశౌచాది దైవగుణాలు క్షీణించక తప్పదు. “విత్తమేవ కలౌ నృణామ్ జన్మాచార గుణోదయః" "సర్వేగుణాః కాంచనమాశ్రయంతే” అన్నట్టు జన్మాచారాది వైశిష్ట్యమంతా మానవులకు ధనం వల్లనే వచ్చి పడుతుంది. "ధర్మ న్యాయ వ్యవస్థాయాం కారణం బలమేవహి” ఎవడికి బలముంటే వాడి కనుకూలంగా ధర్మమూ, న్యాయమూ మారుతూ పోతుంది. "దాంపత్యే 2 భిరుచిర్హేతుః స్త్రీత్వే పుంస్త్వే చాభిరతిః” స్త్రీలూ, పురుషులూ, అన్యోన్యాభి రుచితోనే కలుసుకోటమూ, పెండ్లాడటమూ అంతకుమించి మరే వ్యవస్థాలేదు. "లింగమేవాశ్రమ ఖ్యాతా అన్యోన్యాపత్తి కారణమ్" బ్రహ్మచర్యం మొదలు సన్యాసాశ్రమం వరకూ పైపై వేషభాషలే చాలు హామీ పత్రమివ్వటానికి. ఆ వృత్త్యాన్యాయ దౌర్బల్యమ్. న్యాయానికి బలం లేదు. “పాండిత్యేచాపలం వచః” బాగా వాగ గలగటమే పాండిత్యం. “అనాఢ్యతై వాసాధుత్వే – సాధుత్వే చాధ్యతైవహి” డబ్బుంటే చాలు వాడెంత దుష్టుడైనా
Page 395