#


Index

భాగవతము - సందేశసారము

రాజ్యాలన్నీ శూద్రప్రభుపాలితాలే. శూద్ర అనగానే ఉలిక్కిపడ నక్కరలేదు. ఒక వర్ణం వారిని హేళన చేస్తున్నారని గాబరా పడనక్కరలేదు. శూద్ర శబ్దం వర్ణమాత్ర పరం కాదిక్కడ. గుణపరం. శూద్రగుణమే శూద్రత్వం. ఏమిటా గుణం. శ్లోకంలోనే ఉంది. “అబ్రహ్మణ్యా” అని. బ్రహ్మ అంటే వేదం. బ్రహ్మణ్య అంటే వేదచోదితమైన ధర్మాన్ని అనుసరించేవాడు. అలాంటివాడు కాకుంటే వాడబ్రహ్మణ్యుడు. అంటే శాస్త్ర విహితమైన ధర్మాన్ని కూడా ఉల్లంఘించి ఇష్టానుసారం పాలించే నిరంకుశ పాలకుడు. వారేగా ఇప్పుడు మనకు పాలకులు ! న్యాయస్థానాలూ చట్టాలు కూడా కొట్టి పారేసి కదా వీరు రాజ్యాలు చేయటం. మరి శూద్రఅంటే తప్పేముంది. సంస్కార శూన్యుడెవడో వాడే శూద్రుడు. పశువుల లాగా కేవలం ప్రాకృతంగా బ్రతికేవాడని అర్థం. అలాటి దుష్టగుణ విశిష్టుడే శూద్రరాజంటే "తతో నృపా భవిష్యంతి శూద్ర ప్రాయా అధార్మికాః" అధార్మికులైన రాజులే శూద్రులని భాగవతం స్పష్టంగా చెబుతున్నది.

ఏతే 2 ధర్మానృత పరాః ఫల్గుదా తీవ్ర మన్యవః స్త్రీబాల గోద్విజఘ్నాశ్చ - పరదార ధనాదృతాః ఉదితాస్తమిత ప్రాయాః - అసంస్కృతాః క్రియా హీనాః రజసా తమసా వృతాః ప్రజాస్తే భక్షయిష్యంతి మ్లేచ్ఛా రాజన్య రూపిణః

  ధర్మానికి న్యాయానికీ పూర్తిగా తిలాంజలి ఇచ్చి చెప్పేదొకటి చేసేదొకటి అయి రాజసతామసగుణాలు విజృంభించి స్త్రీలనూ నోరులేని పశువులనూ, విద్యావంతులను, పొట్టన బెట్టుకొంటూ, పరదార పరధనాప హరణంలో సిద్ధహస్తులై - దొంగతనాలు దోపిడీలకూ తామే చేయూత ఇస్తూ చోరస్వభావులూ, క్రూర స్వభావులూ అయి చివరకు ప్రజలనే విరుచుకు తినేందుకు కూడా వెనుదీయ రటరాజులు చూడండి ఇది ఎంత వాస్తవమైన మాటో. మనమిప్పుడు వర్తమాన కాలంలో ఉండే రాజకీయాలను తరచి చూస్తే ఇంతకన్నా తార్కాణమేమి కావాలనిపిస్తుంది. ప్రజాప్రభుత్వాలనే వ్యాజంతో ప్రజలనే వేపుకు తినటం వాళ్ల ఆస్తిపాస్తులు కాజేయటం అదేమిటని ప్రశ్నించిన వారిని హతమార్చటం తప్ప ఏమున్నదిప్పుడు పాలకులు

Page 394

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు