#


Index

భాగవతము - సందేశసారము

ఉన్న భూమాతనూ వాడు నిష్కారణంగా తన్నాడని చెప్పటం కూడా ఇదే. ధర్మాన్ని ఏ మాత్రమూ లెక్క చేయకుండా తిరుగుతున్నారీ కలియుగ మానవులు. ధర్మం తప్పితే ఇక బ్రతుకేమున్నది. సకాలానికి వర్షాలు కురవవు. భూమి ఫలించదు. తిండి తీర్థాలు లేవు. నిరంతరమూ కరువు కాటకాలతో పాడయిపోవలసిందే ఈ జాతి.

  అయితే రక్షకుడైన ప్రభువొకడుంటే కొంత కాలం నిలిచి ఉంటుంది. లేకుంటే చేతికి చిక్కకుండా పోతుంది. అలాంటి రక్షకుడే పరీక్షిత్తు. పరీక్షాశీలుడే కదా పరీక్షిత్తని పేర్కొన్నాము. ఇంత ఘోర కలిలో కూడా అశోకుడిలాంటి ధార్మికప్రభువులు రాజ్యం చేసినంతవరకూ ఏకపాదంతోనైనా ఇది దేకుతూ వచ్చింది. వారూ అంతరించి చివరక పరీక్షితకారులూ అనపేక్షితచారులూ అయిన పాలకమ్మన్యులెప్పుడు వచ్చారో అప్పుడిక చెప్పవలసిందేముంది. కలికాల భుజంగం సహస్ర ఫణాలు విప్పి కనపడ్డ వారినంతా కాటువేస్తున్నది. ప్రస్తుత కాలంలో మనచుట్టూ అనుక్షణమూ మనం చూస్తూ ఉన్న దారుణ పరిస్థితులన్నీ అవే. ఏ రంగంలో చూచినా ఎంత దారుణమో ఎంత అన్యాయమో ఆ పరమాత్మకే ఎఱుక. ప్రతి ఒక్కటీ పూసగ్రుచ్చినట్టు వర్ణిస్తూ వచ్చింది భాగవతం. అదీ ఎప్పుడూ. శుకోపదేశమంతా సమాప్తమయి పరీక్షిత్తు ఆ బోధ అంతా మనసుకు పట్టి తదను సంధానబలంతో తక్షక విషాగ్ని దగ్ధమైన శరీరాన్ని ఒకదగ్ధపటంలాగా వదలి ముక్తుడై పోయిన తరువాత. అంటే ఏమని భావం. ఒక మహనీయుడు చెప్పటమూ, అది శ్రద్ధా భక్తులతో వినటమూ, విని భాగవత ధర్మమేమిటో గ్రహించి ఆ ధర్మమార్గంలో నడవటమూ, ఇలాటి సంప్రదాయం పూర్తిగా దెబ్బ తిన్న తరువాత నని భావం. అలాటి సంప్రదాయమే దెబ్బ తింటే ఇక మిగిలిందేమిటి మానవుడికి. ఏమిటో మన బ్రతుకులు మనకే ఏ కరువు పెట్టి వర్ణిస్తున్నాడు భాగవతకారుడు.

  కలియుగంలో రాజనేవాడు లేడు. రాజన పేరుతో శూద్రులే రాజ్యం చేస్తారు.

శోచత్య శ్రుకలా సాధ్వీ - దుర్భ గేవోజ్ఞితా సతీ అబ్రహ్మణ్యా నృపవ్యాజాః శూద్రా భోక్ష్యంతి మామితి

  శూద్రరాజులు నన్ను పాలిస్తారే అని పరితపిస్తున్నదట భూదేవి. ఇప్పుడు. జరుగుతున్నదదే కదా. శూద్రులు గాక సుక్షత్రియులెవరు పాలిస్తున్నారని ప్రపంచ

Page 393

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు