బోధిస్తుంది రామాయణం. పోతే భారతం ఆ తరువాతి భూమిక అయినజ్ఞానాన్ని ప్రధానంగా చెబుతుంది లోకానికి. కౌరవ పాండవుల కథనిమిత్త మాత్రమే. తరుచుగా చేస్తూ వచ్చింది జ్ఞానబోధే భారతం. భగవద్గీతేమి, విదుర నీతేమి, సనత్సుజాతీయ మేమీ, మోక్షధర్మాలేమి ? అంతా జ్ఞానకోశమే. జ్ఞానం కోసమే. పోతే ఇక మూడవదైన భాగవతం దగ్గరికి వచ్చే సరి కాకేవల జ్ఞాన భూమిక కూడా దాటి మనం దాని పరిపాక రూపమైన భక్తిలో అడుగు పెడతాము. "అహం బ్రహ్మాస్మి” అనే ఐక్యాను సంధానమే ఇక్కడ వ్యవహారం. ఆ అఖండాత్మాను భూతిని సాధించటానికే భాగవత కథా వస్తువంతా. దీనితో మన ప్రయాణమే ముగుస్తున్నది. కర్మ, జ్ఞానం కోసమే. కర్మ, జ్ఞానంలో చేరిపోతే, జ్ఞానం భక్తిలో కలిసిపోతే, ఆ భక్తి నేరుగా మోక్షానికే దారి తీస్తున్నది. ఈ భావానికి ఒక సూచన అయి ఉండవచ్చు రామాయణం భారతంలోనూ, భారత రామాయణాలు భాగవతంలోనూ, ప్రస్తావించ బడటం. యూగాలెలాగైతే త్రేత ద్వాపరంలోనూ, ద్వాపరం కలియుగంలోనూ, చేరిపోతున్నాయో అలాగే యుగానుసారిగా వచ్చిన ఈ మూడింటి రచనలు కూడా ఒకదానిలో ఒకటి చేరిపోయినట్టు వర్ణించటం ఒక చమత్కారం. ఒక శాస్త్ర సంకేతం.
ఇంతకూ ఏ దృష్టితో చూచి చెప్పినా కలియుగానికి చెందిన కలియుగ మానవోద్ధరణ కవతరించిన పురాణం భాగవతం. కలియుగారంభంలోనే గదా పరీక్షిత్తు దీనిని శ్రవణం చేసింది. అప్పటికి కృష్ణ నిర్యాణమయింది. కృష్ణ నిర్యాణంతో ద్వాపరమంతమయి పోయింది. ద్వాపరాంతంలోనే వ్యాసుడీ భాగవతం రచించి తన కుమారుడు శుకుడికి బోధించాడు. అతడు ప్రాయోపవిష్టుడైన పరీక్షిత్తుకు దాని విషయమంతా ఏడు రోజుల పాటు వివరించి చెబుతాడు.
అసలిక్కడ ఇంకొక రహస్యం కూడా దాగి ఉన్నది. కృష్ణ నిర్యాణమైన వెంటనే కలియుగ మారంభమయిందంటే ఏమి టర్ధం. కలి అంటే మనోబలం పూర్తిగా క్షీణించి పోవటమని గదా చెప్పాము. మనసు క్షీణించేదెప్పుడు. పరమార్థానికి బాగా దూరమైనప్పుడే. అదే దానికి క్షీణదశ. కృష్ణ నిర్యాణమైన తరువాత కలి ఆరంభమయిందంటే ఇదే అర్థం. కృష్ణుడంటే పరమార్ధం. అది నిర్యాణమయిందంటే మానవుడి మనసుకది పూర్తిగా దూరమయిందన్న మాట. దూరమైనందుకు నిదర్శనమే కలిపురుషుడి విశృంఖల విహారం. వృషభ రూపంలో ఉన్న ధర్మాన్నీ గోరూపంలో
Page 392