వచ్చి భూమండలంమీద ఒకచోట పడి జీర్ణమయిందట. అదేనట నైమిశారణ్యం. అంటే అరణ్యం లాంటి ఈ సంసారమే. మనోబలం బాగా దెబ్బతినే మానవుడీ సంసారంలో పడిపోయాడు. కనుకనే అలసులూ, మందబుద్ధి బలులూ, అల్పతరాయువులూ, ఉగ్రరోగ సంకలితులూ, మందభాగ్యులూ ఈ కలికాల మానవులు. అన్నీ అవలక్షణాలే. ఇక మంచి పనులు చేయమంటే ఎలా చేస్తారు. సుకర్మములేవి చేయజాలరట. చేయకపోతే ఇక చేసేవన్నీ దుష్కర్మలే. ఏమిటి వాటి ఫలితం సౌఖ్యం లేదు. శాంతి లేదు. పరమార్థానికి దూరమై పోతే అవి రెండూ ఎలా సంభవం.
అందుకే అవి ఎలా కలుగుతాయని అడుగుతున్నారు శౌనకాదులు సూతుణ్ణి.
ఎక్కడో లేరీ శౌనకులూ, సూతుడూ మనలోనే దారి తప్పి జన్మించిన కారణ జన్ముడైన
మహానుభావుడెవడో వాడు సూతుడు. అలాంటి వారిని సేవించి వారి బోధలు విని
జీవిత సత్యమేదో తెలుసుకోవాలంటే శ్రద్ధా భక్తులున్న ఏ కొద్దిమంది విజ్ఞానులో
శౌనకులు. అలాటి వారింకా కొందరుండబట్టే ఇంత కలికాలంలోనూ ఈ సంసారం
మనపాలిటికి కేవల మరణ్యం గాకుండా విష్ణుక్షేత్రమని పేరు పొందింది. వారు
జీవితమంతా ఒక జ్ఞాన యజ్ఞంగా భావించి పరమార్థాన్ని గూర్చి నిరంతరమూ
అన్వేషణ సాగిస్తుంటారు. తమకే గాక తమ తోడివారైన ఈ కలియుగ మానవులంతా
తరించే ఉపాయమేమిటా అని మథన పడుతుంటారు. ఈ కలియుగమందు
మానవులని నిర్దేశిస్తారు శౌనకులు. అలా నిర్దేశించటం వల్ల భాగవతం కలియుగానికి
సంబంధించిన పురాణమని, కలియుగ మానవుల కోసమే ముఖ్యంగా అది
అవతరించిందని అర్ధమవుతున్నది. మత గ్రంథాలని ప్రసిద్ధి చెందిన మూడింటిలోనూ
రామాయణం త్రేతాయుగానికైతే - భారతం ద్వాపరానికైతే భాగవతం కలియుగానికి
చెందిన పురాణం. ఇది ఆ కథలు జరిగిన, రచించిన కాలాన్నిబట్టి మాత్రమేగాదు.
అవి లోకానికే ప్రబోధం చేస్తున్నాయో దాన్ని బట్టి కూడా. కర్మ, జ్ఞానం, భక్తి అని
మూడే భూమికలున్నాయి మోక్షసాధన మార్గంలో. కర్మముదిరితే జ్ఞానం. జ్ఞానం
ముదిరితే భక్తి అవుతాయి. భక్తి అంటే అనన్య భక్తి. అది జ్ఞానం కన్నావేరుగాదు.
తన్నిష్ఠా రూపమైనది. జ్ఞానం పరినిష్ఠితమైతే అదే ఇక మోక్షం. ఇందులో మొదటి
భూమిక అయిన కర్మ మానవుడాచరించవలసిన ధర్మమే. దాన్ని సవిస్తరంగా
Page 391