#


Index

భాగవతము - సందేశసారము

అసలు ఇవ్వదు. ఏమిటది ఇచ్చే ఫలితం మనకు. సుఖమూ శాంతీ. సుఖమనేది సర్వమూ ఆత్మస్వరూపమే ననే విజ్ఞానంవల్ల కలిగితే తద్భిన్నమైన దేదీ సృష్టిలో లేదంతా దాని విభూతేననే వైరాగ్యభావన వల్ల శాంతి చేకూరుతుంది. ఇవే నిజమైన సుఖశాంతులు. మనం లౌకికంగా అనుకొనే ఆశించే సుఖశాంతులన్నీ దీని ఆభాసలే. అవి వాస్తవంలో సుఖమూ గాదు. శాంతీ గాదు. ఇది మనకనుభవ సిద్ధమే. పోతే ఎప్పటికీ మార్పు లేని మాసిపోని సుఖశాంతులీ భాగవత ధర్మమూలకాలే.

  అయితే ఎటువచ్చీవీటికి నోచుకొని ఉండాలి మానవుడు. ధర్మం పాటిస్తేనే అలా నోచుకోగలం. లేకుంటే సుఖశాంతులను పడయకపోగా వాటికి విరుద్ధమైన ఫలితాలకు గురి కావలసి వస్తుంది. ఏమిటా విరుద్ద ఫలాలు. సుఖానికి అసుఖమూ, శాంతికి అశాంతీ. ఇవి రెండూ రెండు దయ్యాల మాదిరి ఎప్పుడూ పొంచి ఉంటాయి మనమీద లంఘించటానికి. మనలను కబళించటానికి. వీటి ధాటికి చోటివ్వకుండా మనుగడ సాగించేవాడే భాగవతోత్తముడు. అలాటి భాగవతోత్తములైన మానవుల కాలమే కృతయుగం. నిరంతరమూ సర్వాత్మ భావరూపమైన సత్యాన్నే దర్శిస్తున్న మానవులు వారు. కనుకనే దానికిసత్యయుగమని పేరు. అది తప్ప వారికి జీవితంలో చేయవలసింది కూడ ఏదీలేదు. అంతా దానిలోనేకలిసి వస్తుంది వారికి అందుచేతనే దాని కసలు కృతమని కూడా పేరు వచ్చింది. నిత్యమూ సత్యదర్శనం చేత సంపూర్ణ సుఖశాంతులను మానవుడు చూరగొనే కాలమే కృతయుగం.

  పోతే సత్య తపోదయాదానాలనే నాలుగు ధర్మపాదాలలో సత్యమనే పాదానికి ముప్పు సంభవిస్తే అది త్రేతాయుగం. త్రేతా అంటేనే అసలు మూడని శబ్దార్ధం. త్రేతాగ్నులనే మాటలో తెలుస్తుంది మనకు. సత్యం తప్ప మిగతా మూడూ ఉంటాయి. ఇందులో. సత్యమప్రయత్నంగా దర్శనమిస్తే కృతంలో ఈ త్రేతలో అది ప్రయత్న సాధ్యమవుతున్నది. ఆ ప్రయత్నమే తపస్సు తపస్సంటే ఏకాగ్రమైన బుద్ధితో చేసే అతితీవ్రమైన ఆలోచన. తద్వారా గాని సత్యాన్ని దర్శించలేకపోయాడు మానవుడు. అలాటి మానవుల కాలమే త్రేతాయుగం.

  పోతే ఈ సత్య తపస్సులు కూడా కుంటుపడి కేవలం దయా దానాలనే రెండు పాదాలతోనే నడుస్తూ పోతే అది ద్వాపరం. ద్వా అంటే రెండు. రెండే పరం అంటే పరాయణం దీనికి. అంచేత ద్వాపరమయిందిది. అంతేకాదు. రెండనే సరికి

Page 389

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు