"శ్రోతవ్యా దీని రాజేంద్ర నృణాం సంతి సహస్రశః” లోకంలో మానవులు విని తెలుసుకోదగిన విషయాలు సవాలక్ష ఉన్నాయి. అయితే అవన్నీ ఎందుకూ పనికిరాని ఊకదంపుడు ప్రసంగాలు. అవి తెలిసినా ఒకటే తెలియకున్నా ఒకటే. ఎందుకంటే విలువైన కాలమెలాగూ గడచిపోతున్నది.
నిద్రయా ప్రియతే నక్తమ్ - వ్యవాయేన నవం వయః - దివాచార్ధే హయా రాజన్ - కుటుంబ భరణేన చ
రాత్రులంతా నిద్రోతోనూ మైథునాది క్రియలతోనూ గడచిపోతున్నది. పగలంతా సంపాదనతోనూ కుటుంబపోషణతోనూ గడుస్తున్నది ప్రాణులకు. పోతే ఇక “దేహా పత్య కళత్రాది ష్వాత్మ సైన్యేష్వ సత్స్వపి” శరీర పుత్ర కళత్రాదులనేవి ఆత్మకావు. ఆత్మకు చెందిన పరివారమిది. ఇది వాస్తవంలో లేనిది. లేని సరుకే ఉన్నట్టు కనిపిస్తుంటే “తేషాం ప్రమత్తో - నిధనం పశ్యన్నపి న పశ్యతి" వాటి ఉచ్చులలో చిక్కి అవి తన కళ్ల ఎదుట రూపు మాసిపోవటం చూస్తూ కూడా తెలుసుకో లేకున్నాడు మానవుడు.
అంచేత నేను చెప్పేదేమంటే
తస్మాద్భారత సర్వాత్మా - భగవాన్ హరి రీశ్వరః శ్రోతవ్యః కీర్తి తవ్యశ్చ స్మర్తవ్యశ్చేచ్ఛతా 2 భవమ్
సర్వాత్మరూపుడైన భగవానుడొక్కడే మనం వినదగిన కనదగిన తెలియదగిన విషయం. అసలిది అనుభవానికి తెచ్చుకొని తరించటానికే "జన్మ లాభః పరః పుంసా మంతే నారాయణ స్మృతిః” మానవజన్మ లభించింది మనకు. మానవ జన్మ లభించి నందుకు పరతత్త్వాన్వేషణమే ప్రయోజనం. అంతేగాని కేవల మాహారాదులతో ప్రొద్దు పుచ్చటానికి కాదీ జన్మ. అంత మాత్రమే అయితే మానవ జన్మే దేనికి.
తరవః కిమ్ నజీవంతి - భస్త్రాః కిమ్ న శ్వసంత్యుత నఖాదంతి నమేహంతి - కిం గ్రామ్యాః పశవో 2 పరే
చెట్లు చేమలు మాత్రం జీవించటం లేదా. ప్రాణం లేని కొలిమి తిత్తులు గాలి పీల్చి వదలటం లేదా - మరి మనచుట్టూ తిరిగే పశువులూ పక్షులూ తినటం లేదా విసర్జించటం లేదా. అంత మాత్రమే అయితే మన గొప్పేమిటి. మన విశిష్టత
Page 387