కనుకనే ఇది విలంబగతి అని చెప్పటం. పోతే నిర్గుణోపాసకులకు ఇలాటి విలంబం లేదు. వారిది ద్రుత గతి. పట్టుకోటం పట్టుకోటమే నిర్గుణంగా నిరుపాధికంగా పట్టుకొన్నారు పరమాత్మ తత్త్వాన్ని, పరమాత్మకే మాత్రమూ నామరూపాదులారోపించి చూచే ప్రసక్తి లేదు వారికి. ఇలాటి భాగవతుల కోటిలో చేరినవారు ప్రహ్లాద కుచేలురు. అసలు భాగవత ధర్మప్రచారకులైన శుకనారదులే ఇలాటివారు. వీరందరూ జ్ఞాన నిష్టాపరులూ, అనన్యభక్తులూ, నిర్గుణోపాసకులూ వీరి దృష్టిలో జగత్తు లేదు. జీవులు లేరు. ఈశ్వరుడూ లేడు. త్రిపుటి అనేది కరిగిపోయి సంపుటీ కృతమై అంతా వారికాత్మ స్వరూపంగానే అనుభవానికి వస్తుంటుంది. అలాంటివారు గనుకనే వారివలె గాక వీరు సాక్షాత్తుగానే మోక్షసామ్రాజ్యాన్ని చూరగొంటారు.
అయితే ద్రుతమైనా విలంబమైనా మొత్తం మీద భాగవతులందరూ ఎప్పటికైనా ఎవరైనా జీవజగదీశ్వరులనే భేద దృష్టి పరిత్యజించి సర్వమూ ఆత్మ స్వరూపమే నని భావించినప్పుడే ముక్తులు కాగలిగారు. అలాగే వర్ణిస్తూ వచ్చింది ప్రతి భక్తుడి చరిత్రనూ భాగవతం. అసలలా అయినప్పుడే అది జీవిత గమ్యమైన పరమసత్యాన్ని చేరుస్తుంది. లేకుంటే అది భాగవతధర్మమే గాదు. అది చేర్చేది భాగవత సత్యమే గాదు. తదాభాస మాత్రమే. అలాటి ఆభాస కోసమే అయితే అసలీ పురాణం లోకంలో అవతరించనే అక్కరలేదు. శాపగ్రస్తుడైన పరీక్షిత్తు కోరింది ఏడు రోజులలో తనకు మోక్షం లభించే మార్గం. అది ఏ మహర్షీ చెప్పలేకపోతే అది చెప్పటానికి వచ్చినవాడు శుకమహర్షి అతడు బ్రహ్మరాతుడు. బ్రహ్మరాతుడు గనుకనే అది బోధించడాని కర్హుడాయన ఒక్కడే. పోతే ఆ బోధ నందుకోటాని కర్హత ఉన్నవాడెవడు. విష్ణురాతుడైన పరీక్షిత్తు. పరీక్షించే స్వభావముంది. అయితే అది సగుణమైన విష్ణుతత్త్వం వరకే పరిమితమైఉంది అంచేత సగుణ దృష్టి నిర్గుణంగా పరిణమిస్తే గాని ముక్తిలేదు. అంచేత సగుణ దృష్టిని నిర్గుణ దృష్టిలోకి క్రమంగా మార్చటానికి చేసి ప్రయత్నమే ఈ భాగవత కథా కథనమంతా. ప్రపంచ సృష్ట్యాదికం దగ్గరనుంచీ అవతార కథల దగ్గరి నుంచీ ఆయా సగుణ నిర్గుణ భక్తుల జీవిత చరిత్రల దగ్గరినుంచీ, ఏ కరువు పెడుతూ రావటం అందుకే. అంతా ఏ కరువు పెట్టి చివరకు ఒక్కమాటలో తేల్చివేశాడు శుకుడు. “అహమేవ పరమ్ బ్రహ్మ- బ్రహ్మాహమ్ పరమం మతమ్” నేనే జీవ జగదభిన్నమైన ఆ ఈశ్వర తత్త్వాన్ని. ఆ ఈశ్వరుడు మరలా ఏదో గాదు. ఎక్కడో
Page 384