#


Index

నిర్గుణ భక్తులు - కుచేలుడు

చెల్లే దశలో అలవరచుకొమ్మనీ గాదు. మోక్షసాధకుడైన వాడు పుట్టి తెలిసినప్పటి నుండీ మరలా గిట్టి నేల మీద పడేవరకూ పరమార్ధాన్ని ఏమరకుండా నిరంతరమూ మనోవాక్కాయాలతో త్రికరణశుద్ధిగా అదే అవలోడనతో కాలం గడుపుతూ దాని అనుసంధాన బలంతోనే ఈ లౌకిక వ్యాపారాలూ నడుపుతూ చివరకదీ ఇదీ అనే తేడా లేక అంతా ఆత్మస్వరూపంగానే దర్శిస్తూ ప్రారబ్ధావసానం కోసం చూస్తూ అది తీరగానే “స్వమహిమ్ని ప్రతిష్ఠితః" అన్నట్టు తన స్వరూపంలోనే తాను పరినిష్ఠితుడయి ఉండటమే యావజ్జీవం చేయవలసిన కర్తవ్యమని భంగ్యంతరంగా చేసే హెచ్చరిక ఇది.










Page 381

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు