అలాంటి వేత్త అయినందు కీపాటి దృష్టి లేకుంటే ఎలాగ. ఈ దృష్టి ఎప్పుడు గట్టిపడిందో ఆయనకప్పుడే కట్టెదుట సాక్షాత్కరించింది లక్ష్మి. ఎవరా లక్ష్మి. పరమాత్మ కటాక్షమే. ఆయన విభూతే. తదీయానుగ్రహమే. "సర్వ ధర్మాన్ పరిత్యజ్య” అన్నప్పుడే దాని ఆవిర్భావం. అంతవరకూ తిరోభావమే. అది ఎప్పుడు భక్తుడు ప్రదర్శించాడో భగవానుడప్పుడే నిదర్శించి చూపాడు.
ఇలాటి భగవదంకితమైన బుద్ధి, జ్ఞానోపార్జితమైన సమదృష్టి ఉన్నవాడు గనుకనే అయాచితంగా తనకంత ఐశ్వర్యమా పరమేశ్వరుడు ప్రసాదించినా ఉబ్బి తబ్బిబ్బులు కాలేదా మహాభాగవతుడు. 'విషయాన్ జాయయా త్యక్ష్యన్ బుభుజే నాతి లంపటః' మనసులో ఏ మాత్రమూ లగ్నం కాకుండానే తానూ తన పత్నీ ఆ విషయ సుఖాలన్నీ యథోచితంగా అనుభవిస్తూ వచ్చారు. "అసక్తస్సుఖ మన్వభూ" త్తని పూర్వం మహారాజులే అలాంటి అసిధారా వ్రతంతో బ్రతికినప్పుడు భాగవతులు బ్రతకటంలో ఆశ్చర్యమేముంది. ఈ ప్రకారంగా “రాగాది విరహితుండును నిర్వికారుండు నునై యఖిల క్రియలయందు నవంతుని యనంత ధ్యానసుధా రసంబునం జొక్కుచు విగత బంధనుండై యపవర్గ ప్రాప్తినొందా”డట ఆ కుచేలుడు. జీవన్ముక్తి తరువాతనే విదేహముక్తి. సమస్త భోగాలూ అనుభవిస్తున్నా నిర్వికారత్వం. అఖిలక్రియలూ ఆచరిస్తున్నా అనంత ధ్యాననిష్ఠత్వం. ఇవే జీవన్ముక్తికి నిదర్శనాలు. ఇలా జీవన్ముక్తుడై జీవిస్తూ ప్రారబ్ధావసానంలో శరీరపాతమై అపవర్గం పొందాడట. అపవర్గమంటే విదేహ కైవల్యమే. మరేదీ గాదు.
ఇదీ కుచేలుడి చరిత్ర. ప్రహ్లాదుడి చరిత్ర చూచాము. మరలా ఈ మహానుభావుడి చరిత్రా చూచాము. రెండూ నిర్గుణ భక్తికి రెండు మచ్చు తునకలు. ఒకటి అభ్యాసమనేది ఎలా ఉండాలో ప్రదర్శిస్తే వేరొకట వైరాగ్యభావమెలా ఉండాలో నిరూపిస్తుంది సాధకుడికి. అందులో ప్రహ్లాదుడు బాల్యంలోనే పరిపక్వత చెంది ఆ పరిపాకాన్నే జీవితాంతమూ నిలుపుకొన్నాడు. కుచేలుడు ప్రౌఢవయసులో పరిపాకమున్నట్టు కనిపించినా బాల్యంనుంచే దాని లక్షణాలలవరచుకొంటాడు. అలా ఉంటేనే అవి యౌవనంలో వార్ధక్యంలో అనువర్తిస్తాయి. దీనిని బట్టి ఈ రెండు కథల ద్వారా మనకు భాగవతం చాటే పరమ సత్యమేమంటే నీవు బాల్యంలో ప్రదర్శించి తరువాత మరచి పొమ్మని గాదు లేక మొదట అంతా విస్మరించి తరువాత వయసు
Page 380