చరిత్రలు. బ్రహ్మ విష్ణు లింగాదులు త్రిమూర్తుల మాహాత్మ్యాన్ని వర్ణిస్తాయి. ఇవన్నీ భగవద్విభూతి వర్ణనలే. ఇవన్నీ కాక ఇక క్రొత్తగా ఒక పురాణమేముందని దానికి భాగవతమని నామం కల్పించటం.
అంతే కాదు. విష్ణు పురాణమని - హరి వంశమని - రెండు పురాణాలున్నాయి. వీటిలో మొదటిది అష్టాదశ పురాణాలలో చేరిందేగాని రెండవది అలా చేరింది కాదు. ఇవి రెండూ అమూలాగ్రమూ విష్ణు మాహాత్మ్యాన్నీ - దశావతార వృత్తాంతాన్నీ భగవల్లీలలనూ - కరతలామలకంగా వర్ణించే పురాణాలు. వీటిలో ఏయే కథలు చెప్పబడ్డాయో అవే మనకు భాగవతంలోనూ తారసిల్లుతాయి. అంతకు మించి క్రొత్తగా చెప్పిన ఉదంతమొకటి కూడా కానరాదు. పురంజనో పాఖ్యానాదులొకటి రెండుంటే ఉండవచ్చు. మిగతావన్నీ విష్ణుకథలూ - కృష్ణ కథలే. విష్ణు కథలకు విష్ణు పురాణముంది. కృష్ణ కథలకు హరివంశముంది. ఇక భాగవతానికి ప్రసక్తి ఏముందనిపిస్తుంది. చూడబోతే భాగవతమైనా వాటికి పునరుక్తి కావాలి. లేదా అవైనా దానికి పునరుక్తి కావాలి. ఇందులో విష్ణు పురాణ మష్టాదశ పురాణాల జాబితాలో ఎలాగూ చేరి ఉంది. అలా చేరనిది హరి వంశమొక్కటే. కాబట్టి భాగవతమో హరివంశమో ఏదో ఒకటి మాతృక అయి మరి ఒకటి దాని కనుకరణం కావలసి ఉంది. ఏది మాతృక అని ప్రశ్న.
హరి వంశమనే పేరులోనే ఉంది కృష్ణుడి వంశమని - కృష్ణుడి చరిత్ర అని. కురువంశాని కనుబంధం హరివంశం. కురు వంశ చరిత్రే గదా భారతం. దానికి హరి వంశం ఖిల పురాణమని ఒక ఆభాణకముంది. కాబట్టి భాగవతమని పరంపరగా చెప్పుకొనే దానికంటే కృష్ణుని చరిత్రకు సాక్షాత్తుగా సంబంధించిన హరివంశాన్ని పరిగణించటమే సమంజసమని తోస్తుంది. పైగా అష్టాదశ పురాణాలూ వ్యాస ప్రోక్తాలని గదా అనుస్యూతంగా వస్తున్నమాట. వ్యాస భగవానుడి శైలి మహా భారతంలో గాని, మిగతా పురాణాలలో గాని ఎక్కడ చూచినావచ్చీ పోయి ఒకే బాణీలో నడుస్తుంది అది అతి స్పష్టమైన సుగమమైన అందమైన అనన్యాదృశమైన ఆర్షవాణి. విష్ణు పురాణ హరి వంశాలలో కూడా అదే శైలి కనిపిస్తుంది మనకు. పోతే దీనికెటు వచ్చీ అపవాదమొక్క భాగవతమే. భాగవతంలో మాత్రమే అలాంటి శైలి కనిపించదు. శబ్ద ప్రయోగమైతే నేమి-వాక్య నిర్మాణమైతే నేమి, చాలా విడ్డూరంగా
Page 38