కష్టం. అలవిగాని సంపద ఒక్కసారిగా చూచేసరికదే జీవిత సర్వస్వమని చెప్పి అందులోనే మునిగిపోయే ప్రమాదముంది. జ్ఞానముంది గదా అది జవాబు చెప్పదా అంటే చెబుతుంది. సందేహం లేదు. కాని అది కూడా చెప్పగలిగి నంతవరకే చెబుతుంది. జీవన్ముక్తుడైనా లోకంతో వ్యవహరించాలి గదా. అలా వ్యవహరిస్తూనే ఎప్పటికప్పుడా కర్మ వాసనలు తనకంటకుండా ఆత్మజ్ఞాన బలంతో అతడు ప్రవిలాపనం చేసుకొంటూ పోతాడు. కర్మ వాసనలు మరీ ఎక్కువైతే ఆ జ్ఞానబలం కూడా సడలిపోవచ్చు. అంచేత కన్నుబోయే కాటుక ఎప్పుడూ పనికి రాదు. అందుకే ప్రస్తుతమీ కుచేలుడికి కూడా భావిజీవితంలో అలాటి దౌర్బల్య మేర్పడకుండా ఉండాలి. ఇదీ ఆవిడ భర్తను వారించటంలో ఉండే ఆంతర్యం.
సరే. అప్పటికీ స్పృహ వచ్చిందయ్యగారికి. అథవా వచ్చినట్టు నటించాడు. తినటమిక మానివేసి తన స్నేహితుడితో బ్రహ్మానందంగా ఆ రాత్రి గడిపాడు. కుచేలుడి కిదంతా ఒక అద్భుతమైన స్వప్నంలాగా ఇంద్రజాలం లాగా కనిపించింది.
“శ్వోభూతే విశ్వ భావేన స్వగుణే నాభినందితః జగామ స్వాలయం తాత - పథ్యను ప్రజ్యనందితః"
తెల్లవారగానే కల్యకరణీయాలు తీర్చుకొని ఆ జగన్నాథుడు తన్ను కొంత దూరం వచ్చి ఆలింగనం చేసుకొన్నాడు. “నివాసితః ప్రియాజుష్టే పర్యంకే భ్రాతరో యథా” తోడబుట్టిన వాడిలాగా తనప్రియురాలి పర్యంకం మీద కూచోబెట్టాడు. “మహిష్యా వీజితః శ్రాంతో వాలవ్యజన హస్తయా” అమ్మవారే స్వయంగా వింజామర పుచ్చుకొని వీచింది నాకు. “శుశ్రూషయా పరమయా” పాద సంవాహనాది సపర్యలు కూడా చేసి నన్నెంతో సత్కరించాడా మహనీయుడు.
అయితే ఇంత చేసి కూడా ఆ మహానుభావుడేమిటీ వింత “శ్రీనిధి యిట్లు నన్నుపచరించి ఘనంబుగ-విత్తమేమియు న్నీని తెఱంగుగానబడె" ఇన్ని ఉపచారాలూ చేసి చివరకు వట్టి చేతులతోనే పంపాడే నన్నింటికి అని ఉన్నట్టుండి ఒక కొఱత ఏర్పడుతుంది కుచేలుడికి. నిజమే. ఎంత నిర్లిప్తుడూ నిష్కాముడైనా ఒక కొఱత ఏర్పడుతుంది కుచేలుడికి. నిజమే. ఎంత నిర్లిప్తుడూ నిష్కాముడైనా తానప్పుడు వచ్చింది ధనకాముడయి. అది శ్రీకృష్ణుడు గ్రహించని వాడు కాడు. పైగా ఆయన
Page 376