#


Index



నిర్గుణ భక్తులు - కుచేలుడు

అంతా ఆత్మే కాబట్టి అది మనకెప్పటి నుంచో సిద్ధమయి ఉందనే ప్రత్యభిజ్ఞ ఒక్కసారిగా ఉదయిస్తుంది. ఇందులో అనాత్మనాత్మగా దర్శించటమే మనమా పరమేశ్వరుని కర్పణ చేయటమనే మాటకర్థం. అలా చేస్తే మనతో సహా ఉన్నదంతా ఒకే ఒక ఆత్మచైతన్య మది మనకు ఎప్పుడూసిద్ధమే నన్న ప్రత్యభిజ్ఞ ఏర్పడుతుంది. కాబట్టి అదే ఆ పరమాత్మ మనకు సమసైశ్వర్యాలూ ప్రసాదిస్తాడనే మాటకర్థం. మనమివ్వనిదే ఆయన మనకివ్వడని లౌకికంగా చెప్పేమాట కలౌకికంగా మనం గ్రహిచవలసిన అంతరార్ధమిది.

  ఇదే ఇప్పుడు కుచేలుని విషయంలో కూడా జరుగుతున్న వ్యవహారం. అటుకులు తెచ్చాడంటే కుచేలుడవి అటుకులు కాదు. నామరూప క్రియాత్మకమైన ఈ అనంతకోటి బ్రహ్మాండాలకూ ప్రతీకలవి. ఒక్కొక్క అటుకుగింజా ఒక్కొక్క అండం. అన్నీ కలిసి ఈ చరాచర సృష్టి కుపలక్షణం. దీని నాయన ఇవ్వకపోయినా తానే కొంగు విప్పి అందుకొని భక్షించాడా పరమాత్మ. అదే చరాచర ప్రకృతినీ తనలో లయం చేసుకొనే ఆయనగారి అతృత్వం. అయితే జీవుడు సమర్పిస్తే గదా ఆయన అందుకోవలసింది. స్వయంగా ఆయనే అందుకొన్నట్టు చెప్పటమేమిటి. సమర్పించినట్టే కుచేలుడు. సమర్పించటానికే గదా తెచ్చాడు. పైగా భార్య తనకు ఆలోచించి ఇచ్చింది కూడా కాదు. తన పాటికి తను భార్య నడిగి తెచ్చాడవి ఇంత దూరం. అప్పటికి మనసులో ఇవ్వాలనే సంకల్పముంది. భౌతికంగా మాత్రమే తీసి బయటపెట్టలేదు. మనసులో ఉంటే చాలు పరమాత్మకు. మన స్సంకల్పమే కదా అన్ని క్రియలకూ మూలం. సంకల్పముంటే అప్పటికది సమర్పణే. అలా మానస సమర్పణ చేశాడు గనుకనే కృష్ణ పరమాత్మ ఆయన చేతులతో తీసి ఇవ్వకపోయినా తానే అందుకొని భక్షించసాగాడు.

  పైగా అందుకొని వాటిని భక్షించే ముందు తనలో తానిలా ఆలోచిస్తాడు కూడా. ఈ కుచేలుడు పాపం నా దగ్గరకు ఐశ్వర్యకాముడై వచ్చాడు. ఇంతకుముందు జన్మలో కూడా వీడు ఐశ్వర్యకాముడే. అయితే ఆ కామనవరకే నిలిచిపోయాడు. నన్ను సేవించిన పుణ్యానికి నోచలేదు. ఇప్పుడీ జన్మలో దానికి ఫలితంగా దరిద్రుడయి జన్మించాడు. అనేక జన్మల సుకృతం కొద్దీ జ్ఞానియై తనకోసం కాకపోయినా నిజకాంతా ముఖోల్లాసం కోసమని చెప్పి నావద్దకు వచ్చాడు. వీడికిప్పు డీక్షణంలోనే నేను

Page 374

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు