#


Index



నిర్గుణ భక్తులు - కుచేలుడు

దళమైన - పుష్పమైనను - ఫలమైనను - తోయమైన పాయని భక్తిం గొలిచిన జనులర్పించిన - నెలమిన్ రుచిరాన్నముగనె యేను భజింతున్ నూటికి నూరుపాళ్లూ ఇది భగవద్గీతలోని శ్లోకాని కనువాదం పత్రమ్ – పుష్పమ్ – ఫలమ్ - తోయమ్ - యోమే భక్త్యా ప్రయచ్ఛతి తదహమ్ - భక్త్యుపహృతమ్ - అశ్నామి ప్రయతాత్మనః

  అని దీనికి మూలం. భక్తుడు భక్తితో ఇచ్చింది ఏదైనా సరే. తానది ఎంతో ఇష్టంగా భక్షిస్తాడట.

  ఏమిటిదంతా. ఇలా మాటాడటంలో ఏమిటి ఉద్దేశం. అసలు నాకేమి కానుక తెచ్చావని ఆయన నోరు దెఱచి అడగటమేమిటి. అది ఎలాంటిదైనా ఏ కొంచెమైనా చాలునని ఒడ్డుకోటమేమిటి. అది తాను తింటానని చెప్పటమేమిటి. పసిపిల్లవాడా తిండి కోసమే కారటానికి. ఏదో ఉన్న దాంతర్యం. ఏమిటది. భక్తుడు భగవంతుణ్ణి ఏదైనా కోరవచ్చు. ఎంతైనా కోరవచ్చు. ఇచ్చేవాడుంటే కోరటానికేమి కొరత. కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంటాయి కోరికలు. మానవుడి కన్నీ కొరవలే కాబట్టి కోరటమూ సహజమే. భగవంతుడు సర్వాధికారి కాబట్టి ఇవ్వటానికి సమర్థుడే. కాని ఎంత సమర్ధత ఉన్నా ఇవ్వడొక రాగరాగాన. ఏమి. ఎందుకని అడిగే మానవుడికది పుచ్చుకొనే అర్హత ఉందో లేదో తెలుసుకోవాలాయన. పైగా అడిగిందే తడవుగా ఇస్తూ పోతే దాని విలువ తెలియదతనికి. దుర్వినియోగం చేసినా చేయవచ్చు. అహంకరించినా అహంకరించవచ్చు. రెండూ ప్రమాదమే. ఇచ్చీ నిష్ఫలమౌతుందా కోరిక. అందుకే నీకు యోగ్యత ఉందని నిరూపించుకొనేదాకా ఉలకడు పలకడాయన.

  అయితే ఏమిటా అర్హత. త్యాగబుద్ధి. "తేన త్యక్తేన భుంజీథాః” అని శాస్త్రం. నీకొకటి భుజించాలని ఉంటే ముందు నీ దగ్గర ఉన్నది త్యజించాలి. అవి పైకి త్యజించినట్టు కనిపించినా ఇంకా దాగి ఉంటుంది మనలో త్యజించవలసిందొకటి అదే అహంకారం. అది కూడా త్యజించాలి. “యేన త్యజసి తత్త్యజ” అనే భారత సుభాషతంలోని అంతరార్ధమిదే. పైపై వస్తువులు త్యజించటం మమకార త్యాగానికి సూచకమైతే లోపలి దాన్ని త్యజించటం అహంకార విసర్జనానికి చిహ్నం. మొత్తంమీద మనదనుకొనేది, మనమనుకొనేది ఏముందో అదంతా చిన్నదీ పెద్దదీ అని ప్రశ్నలేదు.

Page 372

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు