#


Index



నిర్గుణ భక్తులు - కుచేలుడు

బహుపుత్ర సంతానమూ నని కాదు. అలాగే ఫలించిన నాడు కుచేలుడూ కృష్ణుడిలాగానే సకలైశ్వర్యాలతోనూ తులతూగుతుండాలి గదా. దరిద్రమెలా అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం ధనార్ధి అయి తన దగ్గరికెలా వచ్చాడు. వచ్చాడంటే అప్పటికి ధనహీనుడు కావటం మూలాన్నే గదా. మరి ధనహీనుడైతే గురువు గారి మాట ఖాళీ అయినట్టే గదా. ఏమిటది. ఇలా ఎందుకు జరిగింది. నాకేమీ అర్థం కావటం లేదే చెప్పమని అడిగినట్టుంది కృష్ణుడి మాట. ఆయన కర్థం కాక కాదు. బ్రహ్మజ్ఞుడైన ఆ బ్రాహ్మణుడేమి సమాధానమిస్తాడో విందామని.

  మరి ఆయనకన్నా ధీరుడీ మహానుభావుడు. అంతఃపురంలో అడుగు పెట్టింది మొదలు ఈ మాట చెవిన బడేదాకా పెదవి విప్పి ఒక్క పలుకు కూడా పలకలేదా బ్రాహ్మణుడు. అన్ని వ్యవహారాలూ మౌనంగానే చూస్తున్నాడు. మౌనంగానే ఆలకిస్తున్నాడు. అలాంటి వాడిప్పుడీ మాట వినగానే పెదవి విప్పాడు. సమాధానం చెప్పసాగాడు. ఏమని.

వనజోదర ! గురు మందిర మున - మనము వసించునాడు ముదమున గావిం పని పనులెవ్వియు గలవే వినుమవి యట్లుండ నిమ్ము విమల చరిత్రా

  కృష్ణా గురుకులంలో విద్యాభ్యాసం చేసే రోజుల్లో మనమొకటేమిటి. ఎన్నో ఘనకార్యాలు చేశాము. అవన్నీ దేనికిప్పుడు. ఒక్కమాట చెబుతాను విను.

గురుమతి దలపగ ద్రిజగ ద్గురు డ వనం దగిన నీకు గురుడనగా - నొం డోరుడెవ్వ డింతయును నీ కరయంగ విడంబనంబ యగు గాదె హరీ

  కొంచెం లోతుకు దిగి ఆలోచిస్తే నాకుంటే ఉండవచ్చు గాని నీకు గురువెవడున్నాడు. త్రిలోకాలకూ నీవే గదా గురువు. అలాంటివాడికొక గురువంటూ ఎవడుంటాడు. సాందీపని కారు, మరొకడుకాడు నీకు గురువు. అదంతా లోకుల కళ్లు గప్పే నీ మాయ తప్ప మరేదీ గాదు సుమా అని సాభిప్రాయంగా పలికాడు.

Page 370

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు