#


Index



నిర్గుణ భక్తులు - కుచేలుడు

ఆ ప్రస్తావన చేయటంలో ఒక అభిప్రాయముంది. అది ఇప్పుడే బయటపెట్టరాదు. అది బయటపెట్టే ముందు లోక ధర్మంగా తన స్నేహితుడి యోగక్షేమాలు విచారించాలి. అలా విచారిస్తూ వచ్చి ప్రసంగవశాత్తూ ఆ విషయం బయట పెట్టి నట్లుండాలి. అప్పుడే అదిసహజంగా ఉండేది. చతురత కూడా అదే.

  అలాంటి చతురతతోనే ఇలా అడుగుతున్నాడా బాల్యస్నేహితుణ్ణి.

బ్రాహ్మణోత్తమ ! వేదపాఠన లబ్ధ రక్షణ గలచారు వంశంబు వలన పరిణయంబై నట్టి భార్య సుశీల వర్తనముల దగ భవత్సదృశయగునె తల ప గృహక్షేత్ర ధనదార పుత్రాదులందు నీ చిత్తంబు చెందకుంట తోచుచున్నది - యేను తుది లోక సంగ్రహార్ధంబు కర్మాచరణంబు సేయు
గతి మనంబుల దాము మోహితులు గాక యర్ధిమై యుక్త కర్మంబు లాచరించి ప్రకృతి సంబంధములు వాసి భవ్య నిష్ఠం దవిలి యుందురు కొందఱుత్తములు భువిని


  ఏమయ్యా ! పెండ్లి చేసుకొన్నాడు గదా. శుభలేఖ అయినా పంపలేదేమిటి నాకు. పోనీ పంపకపోతే మానె. నీకు తగిన వంశంలోనే చూసుకొన్నావా కన్యను. ఆవిడ నీ కన్నివిధాలా అనుకూలంగా వర్తించే సౌశీల్యవతియేనా. ఏమిటిలా అడగటంలో స్వారస్యం. లలిత పతివ్రతా తిలకంబని మొదటనే వర్ణించాడు కవి ఆవిడ పాతివ్రత్యాన్ని. ఇక్కడ మరలా అదే మాట కృష్ణుడి నోట పలికిస్తున్నాడు. అంత అనుకూలవతి గనుకనే అది లేదిది లేదని అల్లరి పెట్టకుండా గుట్టుగా కాపురం చేస్తూ వచ్చిందా మహాతల్లి. లేకుంటే ఏమయిపోయేవాడో ఆ కుచేలుడు. అది సర్వాంతర్యామి అయిన ఆ కృష్ణ పరమాత్మకు బాగా తెలుసు. అంతేకాదు. నీ మనసు ధనదారాదుల యందు లగ్నం కానట్టుగా నాకు తోస్తున్నదంటాడు. ఇది ముందరి కాళ్లకు బంధాలు వేసేమాట. ధనం మీద దృష్టిలేని విరక్తచిత్తుడవు గదా నీవు నా దగ్గరకు ఎందుకు వచ్చినట్టు. బహుశః దార సుతోదర పోషణార్ధమంటావా. వారి విషయంలో కూడా నీవు విరక్తుడవేదా. మరి ఎందుకంటావా నీ రాక. ఎందుకో తానే భంగ్యంతరంగా బయట పెడుతున్నాడు మరలా. నా మాదిరే కొందరు తమకోసం

Page 368

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు