వచ్చాడు. గాఢాలింగనం చేశాడు. దగ్గరి బంధువు వచ్చినట్టుగా తోడెచ్చి తన శయ్యమీదనే కూచోబెట్టాడు.
ఇక చూడండి. ఆ కుచేలుడి కాయన చేసిన మర్యాదలు. రాజోపచారాలు
చేశాడు. బంగారు కలశంతో కాళ్లు కడిగాడే. ఆ జలం తన శిరసుమీద చల్లుకొన్నాడే.
హరిచందనం అతడి శరీరమంతటా అలదాడే బడలిక తీరేలాగా తాళవృతాంతంతో
విసిరాడే. మణిదీపాలతో నీరాజనమిచ్చాడే. సురభి కుసుమ మాలికలు సిగలో
తురిమాడే. కర్పూర తాంబూల మొసగాడే. ఆఖరు కొక మంచి పాడియావును
తెప్పించి అప్పటి కప్పుడా బ్రాహ్మణుడికి దానం కూడా ఇచ్చాడు. అంతేకాదు.
"దేవీ పర్యచర ద్భైష్మీ- చామర వ్యజనేనవై" తన పెనిమిటితోపాటు తానూ ఒక
వీవనచేత బుచ్చుకొని ఆయనకు వీస్తూ కూచుంది సాక్షాలక్ష్మీ స్వరూపిణీ అయిన
రుక్మిణీ. ఏమిటీ సంరంభం ఈ హడావుడి. తాను క్షత్రియుడు. ఆయన బ్రాహ్మణుడు.
ఎంత స్నేహితుడైనా జాతిరీత్యా ఆయనను తాను గౌరవించి తీరాలి. పైగా ఎవడో
అపరిచితుడు కాదాయన. తనతో చిన్ననాటి నుంచీ చదువుకొన్నవాడు. కలిసి
ఆడుకొన్నవాడు. చాలా కాలానికి తన దగ్గరికి వచ్చాడు. అలాంటివాడి విషయంలో
తానెంతైనా అభిమానం చూపాలి. అంతేకాదు. ఆయన తనకు ఇష్టసఖుడే గాక
పరమ భాగవతుడూ, మహాజ్ఞాని. “ప్రియో హిజ్ఞాని నో త్యర్ధ మహం
సచ
మమప్రియః” అని తానే చాటించాడు లోకానికి. అలాంటప్పుడు తనకు జ్ఞానులపైన
ఎంత అనురాగమున్నదో అక్కడ ఉన్న నలుగురికీ ప్రదర్శించాలి. ఎవరక్కడ ఉన్నవారు.
తన కత్యంత ప్రీతి పాత్రమైన అంతఃపుర కాంతలు. వారందరికీ ఒక
అహంభావముంది కృష్ణుడు తమవాడే తమకన్నా ఆయన కాప్తులు లేరని. మీరేమిటి
మిమ్ములను మించిన మహానీయులున్నారు తెలుసుకోండి అని వ్యంగంగా వారికి
చాటి చెప్పటమిది. అందుకే ముందుగా ఆయన కెదురు పోవటం దగ్గరి నుంచీ
గోదానం వరకూ తానాయనకు సకలోపచారాలు చేసి తన కాంతలచేత కూడా
చేయించాడు.
ఆ కాంతలు కూడా తెలియని వారు కాదాయన గారి హృదయం. పట్ట మహిషి రుక్మిణితో సహా భర్త ఆయన కన్ని పరిచర్యలు చేస్తుంటే ఆ మాత్రం గ్రహించలేరా. గ్రహించే ఇలా అనుకొంటారు తమలో తాము.
Page 366