#


Index



నిర్గుణ భక్తులు - కుచేలుడు

కనుక్కోవాలని గదా అంతకుముందు సందేహించాడు. ఎలా ప్రవేశించాడో ఏమో ఆయనకే ఎఱుకలేదు. ద్వారకాపుర మతడు సొచ్చి రాజమార్గంబునం జనించని కక్ష్యాంతరంబులు గడచిచని ముందట ఎవరో చేయి పట్టి తీసుకుపోతే పోయినట్టా పట్టణం ప్రవేశించాడు. రాజమార్గంలో నడచివెళ్లాడు. రాజగృహ కక్ష్యాంతరాలన్నీ దాటగలిగాడు. ఎలా దాటగలిగాడు. ద్వారపాలకులు లేరా అక్కడ. అడ్డగించలేదా. అదే చిత్రం. అదేమీ ప్రస్తావించడు మహాకవి. పాఠకులుగా మనమే ఊహించుకోవాలి. భగవచ్ఛక్తి ఆ భాగవతుడి మనసు కెప్పుడు నిశ్చయం కలిగిందో అప్పటినుంచే పని చేస్తున్నది. అది పనిచేయటం మూలాన్నే అంత నిరాఘాటంగా లోపల ప్రవేశించ గలిగాడు. ఆ ప్రవేశించటంలో కూడా సరాసరి అంతఃపురంలోకే చొచ్చుకొని పోగలిగాడు. అంతా ఆ పుండరీకాక్షుడి కటాక్ష వీక్షణమేనని తెలుసు ఆ భాగవతోత్తముడికి.

  తత్ప్రసాద దూరీకృత సకల విధంతరాయుడైన ఆ పరమ భాగవతుడు లోనికి వెళ్లాడో లేదో వెంటనే ఆయన దృష్టి మృదులమైన హంస తూలికా తల్పం మీద తానూ తనప్రియురాలు రుక్మిణీ బహువినోదములతో క్రీడించే మహిత లావణ్యుడైన ఆ మన్మథ మన్మథుడి మీదనే పోయి వాలింది. "ఇందీవరశ్యాము వందిత సుత్రాము · కరుణాల వాలు- భాసురక పోలుడైన ఆ లీలా మానుషవేషధారి నాది నారాయణుణ్ణి” దర్శించి దగ్గరగా రాసాగాడు. అలా వస్తూ ఉన్న ఆ భాగవతోత్తముణ్ణి చూచీ చూడటంతోనే ఎదురు వచ్చాడా పరమాత్మ. ఎలా వచ్చాడు. దళత్కంజాక్షుడై వచ్చాడట. అంతకు ముందూ కంజాక్షుడే స్వామి. మరి దళత్ అనటంలో ఏమిటి వివక్షితం. తన బాల్యసఖుణ్ని చూచేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ రెండు కళ్లూ విప్పారాయి ఆయనకు. ఏమంత కళ్లు విప్పుకొని చూడవలసినంత విగ్రహమా అది. పేదవిప్రుడూ, అశ్రాంత దరిద్ర పీడితుడూ, కృశీభూతాంగుడూ, జీర్ణాంబరుడూ ఏమిటిలాంటి వాణ్ణి చూచేదాయన. ఇలాంటి వాళ్లనే చూస్తాడు. అకించనులైన భాగవతులే పరమాత్మ అనుగ్రహానికి పాత్రులు. అయితే ఇక్కడ అకించనుడే గాక కుచేలుడు ఘనతృష్ణాతుర చిత్తుడయి ఉన్నాడట. అందుకే హాస్యనిలయుడయినాడు కృష్ణుడికి. ఆ తృష్ణ ఒకటి ఉత్తరీయం మాదిరిపైన కప్పుకోకపోతే బాగుండును. ఖండోత్తరీయుడయి ఉండేవాడు కుచేలుడు. సరే దానిని తానే ఖండించి నెమ్మదిగా అనుగ్రహిద్దామనుకొన్నాడు. వెంటనే సంభ్రమ విలోలుడై తల్పం దిగి ఎదురుగా

Page 365

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు