అది ముఖ్య ప్రాణమైతే పురాణానికి- మిగతా కథా కథన సామగ్రి అంతా దానిని చక్కగా ఆవిష్కరించటానికి కావించిన ఒక బృహత్కల్పన. ఇది పురంజనో పాఖ్యానాదులలో స్పష్టంగానే దాఖలా అవుతుంది మనకు. అది ఔషధం సేవించటానికి వైద్యుడు మనకు కట్టి ఇచ్చే ఒక మోతాదు పొట్లం లాంటిది ఆ మోతాదులోనే మిగతా మందు మనమెలా సేవించాలో అలాంటి దృష్టితోనే చూడాలి మనం పురాణ ప్రపంచాన్నంతటినీ. అలా చూచి దాని తత్త్వాన్ని ఆకళించుకొన్నప్పుడే అది ప్రభు సమ్మితమైన శాస్త్రం కన్నా - మిత్ర సమ్మితమైన ధర్మ ప్రధానమైన ఇతిహాసం కన్నా పరమ పురుషార్థమైన మోక్షాన్నే ప్రతిపాదిస్తుంది. కాబట్టి వాఙ్మయానికంతటికీ తలమానిక మయి మానవజాతి కత్యంతో పకారకమూ ఉపాదేయమూ కాగలదు.
Page 36