తోస్తే జంకూ కొంకూ లేక ఆ భాగవతుడు సరసర దగ్గరకే పోయి సాష్టాంగ ప్రణామం గావిస్తాడు. కరుణా తరంగితా పాంగావ లోకములతో ఆలోకించి ఆ దేవుడు తన దక్షిణ హస్తమా బాలుడి మస్తకం మీద మోపుతాడు. అదే అనుగ్రహంగా భావించి పరిపరివిధాల కీర్తిస్తాడా దేవుణ్ణి ప్రహ్లాదుడు. ఆ దేవుడు అతని అచంచల భక్తి ఎలాంటిదో పరీక్షిద్దామని ఏదైనా వరం కోరుకోమంటాడు. “వరమ్ వృణీష్వాభి మతమ్ - కామపూరో ఽ స్మ్యహం నృణామ్" మానవులేది కోరినా తీరుస్తాను కోరమంటాడు.
ఏవం ప్రలోభ్యమా నోపి - వరైర్లోక ప్రలోభనైః ఏకాంతిత్వా ద్భగవతి - నై చ్ఛత్తా నసురోత్తమః స్మయ మాన ఉవాచైనమ్ - మామ్మా ప్రలోభయోతృత్త్వా సక్తం కామేషు తైర్వరైః తత్సంగ భీతో నిర్విణోవిముముక్షు రుపాశ్రితః
ఎందుకయ్యా నన్నిలా ప్రలోభపెడతావిలాంటి వరాలు నాకక్కరలేదు. ఇవన్నీ సంసారంలో పడదోసేవే. నాకు కావలసింది మోక్షమనేది ఒక్కటే నని తెగవేసి చెబుతాడాయనతో.
ఇదే సగుణానికీ నిర్గుణానికీ తేడా. నిర్గుణుడికే వాంఛా లేదు. వాడికున్న వాంఛ అల్లా ఒక్క మోక్షమే. అది వాడికి జ్ఞానంలోనే అంతర్భూతమయి ఉంటుంది. ఏ దేవుడూ ఇవ్వనక్కరలేదు. ప్రహ్లాదుడి దిలాటి ఉత్తమోత్తమ స్థితి. సర్వమూ ఆత్మమయమే అతనకి. ఇక క్రొత్తగా కోరవలసిందేముంది. పొందవలసినదేముంది. నృసింహమూర్తి హస్తమస్తకయోగం చేశాడన్నా దాని అర్ధం వేరు. వీడొక్కడే సుమా సమ్యగ్దర్శి. ఇలాంటి సమ్యగ్దర్శన మలపరుచుకొని బ్రతకండి మీరంతా నని అక్కడ మూగిన బ్రహ్మేంద్రాదులకు చేసే సూచన అది. మరి ప్రహ్లాదుడాయన గుణగణాలనూ మహిమలనూ కీర్తించటం కూడా ఫల నిరపేక్షంగా లోక సంగ్రహ దృష్టితో చేసే వ్యవహారమే. ధీరులు నిరపేక్షులు నాత్మారాములు నైన మునులు హరి భజనమ నిష్కారణము సేయుచుందురని సూత మహర్షి శుకయోగిని గూర్చి ఎప్పిన మాటే ఇక్కడా వర్తిస్తుంది.
Page 353