ధరించాడు. ఈ దేవుడి చేతిలో నాకు చావు తప్పదు. అయినా లోకం కోసం కొంతనా పరాక్రమం ప్రదర్శించి చూస్తానంటాడు.
చూడండి ఈ మాటలలో ఎంత భావ గాంభీర్యముందో ఈశ్వరుడు సర్వగతుడనే విషయం వాడికెఱుకే అప్పటికి అయినా కుర్రవాణ్ణి రెచ్చగొట్టాడంటే ఆయన ఈ రూపాన్ని ధరించి బయటపడతాడో లేదో చూతామని. తాను అనుకొన్నట్టె బయట పడ్డాడాదేవుడు. ఇంకేమి. ఆయన చేతిలో తన శాప జన్మ తీరిపోతుంది. తాను ముక్తుడవుతాడు. త్వరగా ఆయనను మీద వేసుకోవాలంటే తానాయన పై చేయి చేసుకోవాలి. అలా చేస్తే తన స్వామితో కలిసి క్రీడించాననే తృప్తి అయినా ఉంటుంది. ఆ తరువాత సాయుజ్యం లభిస్తే ఎలాగూ లేదా వినోదం. ఇదీ ఆ దానవ భక్తుడి మాటలలోని మర్మం. అందుకే మెత్తబడిన చిత్తంతో గదా దండమెత్తి ఆయన మీద జళిపించాడట. జళిపిస్తే ఆయనేమి తక్కువ వాడా. భక్తుడి హృదయమర్థం కానివాడా. వాడు తన్ను హరించటం కాదు. తానే వాణ్ణి హరించాలనుకొన్నాడు. వాడు తన్ను హరించాలంటే అది సాత్త్వికంతో రావాలి. మరి రాజసమైంది వాడి భక్తి. అంచేత వాణ్ణి తాను హరించాలి. అంటే రజః ప్రమార్జనం చేసి సత్త్వాన్ని వాడికందివ్వాలి. సత్త్వజన్యమైన జ్ఞానంతో వాడుతరించాలి. అంచేత "సటలు జళిపించి గర్జించి సంభ్రమించి జిహ్వ యాడించి లంఘించి చేతనొడిసి” పట్టాడు వాణ్ణి. విహగేంద్రుం డహి వ్రచ్చుకైవడి మహోద్వృత్తితో వాడి శరీరాన్ని ప్రచ్చాడు. వాడు చచ్చాడు. వాడు కాదు వాడి ఉపాధి. అది అనాత్మ. అనాత్మ గనుకనే అది ఆనరకేసరి ఖరనఖర శిఖా విదారితమయిపోయింది. క్షురధారోపమములైన ఆఖర నఖరములే స్వామి సన్నిధికి మార్గం చూపి జయుడికి మరలా నిజమైన జయాన్ని ప్రసాదించాయి.
ఇక్కడికి హిరణ్యుని పరీక్ష పూర్తి అయింది. ఇక ప్రహ్లాదుడికి పరీక్ష. అది ప్రతిలోమమైతే ఇది అనులోమం. అది దారుణమైతే ఇది సుకుమారం. త్రిదశులంతా వచ్చి కీర్తించారా మూర్తిని. కాని ఆ మూర్తికి దగ్గరగా రావటానికందరికీ భయాందోళనలే. ఒకరినొకరు మీరు వెళ్లి చెప్పండి. మీరు వెళ్లి చెప్పండి. అని ముందఱికి తోస్తుంటే మళ్ల బడి వెనుకకు తగ్గేవారే. నారదుడేమిటి, బ్రహ్మ ఏమిటి, కడకు నిత్యానపాయని అయిన మహాలక్ష్మి ఏమిటి, ఎవరు గానీ అడుగు ముందుకు వేయలేకపోయారు. అందరూ కలిసి చివరకు ప్రహ్లాదుణ్ణి ముందుకు తోస్తారు
Page 352