నరమూర్తి గాదు కేవల హరి మూర్తియు గాదు మానవాకారముకే సరి యాకారము నున్నది హరి మాయా రచితమగు యథార్ధముసూడన్
ఇప్పటి కర్దమయింది వాడికిదంతా హరి మాయేనని. యథార్థం చూస్తేనే అర్ధమయింది. అంతవరకూ మాయ అయిందీ తెలియదు. స్వరూపమయిందీ తెలియదు. స్వరూప జ్ఞానం కలిగితే గాని మిగతా వేషభాషలన్నీ మాయమయమని గ్రహించలేడు మానవుడు. ప్రస్తుత మలాంటి స్వరూప జ్ఞానమేమి కలిగిందని హిరణ్యకశిపుడికి. నరమూర్తి హరిమూర్తి రెండూ కాకుండానే రెండూ అయింది నేను చూచానంటున్నాడు వాడు. ఇదే స్వరూప జ్ఞానం. ఎలాగ. నరరూపమంటే నశించే జీవుడి రూపం. హరి రూపమంటే దాన్ని హరించే లేదా నశింపజేసే ఈశ్వర రూపం. ఈ జీవేశ్వరులు రెండూ కాని దా పరతత్త్వం. అదే మరలా మనకు కనపడ వచ్చేసరికీ నరకేసరి రూపంలో కనిపిస్తున్నది స్వరూపమే విభూతిగా మారి దర్శనమిస్తున్నది. అలా దర్శనమివ్వటమే మాయ. ఈ మాయవెనకాల ఉన్న ఆ మాయావే స్వరూపం. ఇదీ ఆ దానవ భక్తుడు గ్రహించిన తత్త్వ రహస్యం.
ఈ రహస్యమతడు కారణ జన్ముడు కాబట్టి మొదటి నుంచే గ్రహించి ఇంత కాలమూ తన జన్మ కడతేర్చుకొని పోవటానికలా దుర్మార్గుడుగా నటిస్తూనైనా వచ్చి ఉండాలి. లేదా మొదటి నుంచీ సగుణ బుద్ధి వదలకుండా మెలగుతూ వచ్చి నిర్గుణ భావనిష్ణాతుడైన కుమారుడి హిత బోధనల మూలంగా మనసు మారి చిట్టచివరకిలా సత్యాన్ని దర్శించిన వాడైనా కావాలి. ఏదైనా ఒక్కటే. కేవల సాకారం గాక సత్యం నిరాకారమూ సాకారమూ కూడనని గ్రహించటమే చాలు. అది వాడి చిత్తపరిపాకాన్ని సూచిస్తుంది. ఇలాటి పరిపాక మతడికి కలిగినట్టు తరువాతి వ్యవహారం చూస్తే మనకు దాఖలా అవుతుంది.
తెంపున బాలుడాడినను ధీరత సర్వగత్వమున్ ప్రతి ష్ఠింప గ వచ్చినాడు - హరిచే మృతి యంచు దలంతు నైన నా సొంపును బెంపు నందఱును జూడ జరింతు హరింతు శత్రువున్
నా స్వామి అయిన విష్ణుదేవుడే నన్ను శిక్షించాలని ఈ రూపంలో సాక్షాత్కరించాడు. తన సర్వాత్మకత్వాన్ని నిరూపించుకోవాలని ఇలాటి వేషం
Page 351