#


Index



నిర్గుణ భక్తులు - ప్రహ్లాదుడు

చైతన్యమైన దానికెలా సంభవం. కనుక దానినలాగే దర్శించగలగాలి మానవుడు. అప్పుడే అది నిజమైన జ్ఞానం. దానికి వ్యతిరిక్తమైనదంతా ఇక అజ్ఞానమే. ఇలాంటి అజ్ఞానం వదలకుండానే అడిగాడు హిరణ్యకశిపుడది ఎక్కడ ఉందో చెప్పమని. ఎక్కడ ఉండటమేమిటి. సర్వత్రా ఉన్నది. ఎక్కడ అంటే అది విశేషం. నామ రూపాదులన్నీ ఇలాంటి విశేషాలే. ఈ విశేషాలు గాక ఈ విశేషాలలో సమానంగా పరచుకొని దాగి ఉన్న ఆ తత్త్వాన్ని పట్టుకో చేతనైతే. అదే నీవు వెదకవలసింది ఇది గాదని హెచ్చరిస్తున్నాడు మరలా.

ఇందు గల డందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన అందందే గలడని

"భూతేషు భూతేషు విచిత్య ధీరాః” అన్నదుపనిషత్తు. ప్రతి అణువులో వెతకి చూడాలట తత్త్వదర్శి. వెతకటమూ, చూడటమూ రెండున్నాయిక్కడ. వెతకటం జ్ఞానమైతే చూడటం అనుభవం. ప్రపంచంలోనే వెతకాలి దాన్ని. మరెక్కడా గాదు. అయితే ప్రాపంచికమైన వస్తువులను గాదు. వస్తువులన్నీ వ్యాపించిన అసలు వస్తువును. కుండలనూ, బానలనూ, అటికలనూ, ముంతలనూ, వెతికితే ఏముంది. అవి పైకి కనిపించే రూపాలు. ఆ రూపాలనన్నిటినీ అలముకొని ఉన్న మృత్తిక అనే మూలతత్త్వాన్ని వెతికి పట్టుకోవాలి. పట్టుకొంటే అప్పుడీ రూపాలన్నీ ఆమృద్రూపాలే గదా అని మృదేకత్వ జ్ఞానం కలుగుతంది. అలాగే ఈ వననదీ పర్వతారణ్య గ్రహచంద్ర సూర్యనక్షత్ర తారకాది చిత్రవిచిత్రమైన బ్రహ్మాండమంతా సద్రూపమే గదా, చిద్రూపమే గదా అని దర్శిస్తూ పోతే చివరకంతా సదే కత్వమనే జ్ఞానమే ఉదయిస్తుంది. అది మన స్వరూపమే కాబట్టి ఇక వెదకే ప్రయాసే లేదు మనకు. అంతవరకూ ఎక్కడ వెదకినా ప్రయోజనం లేదు. ఇదీ ఆ మహాభాగవతుడి ఉపదేశవచో హృదయం.

  ఎంత హృదయమైనా అర్థమయితే గదా ఆ అహంభావికి. ముందు పేర్కొన్నట్టు మహాబధిర శంఖాధానమది. ఒకడి దృష్టి సోపాధికం. మరొకడి దృష్టి నిరుపాధికం. రెండూ రాజీపడటమెలాగ. అందుకే ఒకరితో ఒకరీ వాదించుకోటం. హరి సర్వాకృతులం గలండనుచు ప్రహ్లాదండు భాషిస్తే సత్వరుడై యెందును లేడు లేడనిసుతున్ దైత్యుండు తర్జిస్తున్నాడు. ఉన్నాడనే వాడీ చూచే ఆ కృతులన్నీ అదే

Page 348

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు