ద్రాతం జంపిన మున్నునే వెదకితిన్ బల్మాఱు నారాయణుం డేతద్విశ్వము లోన లేడు మఱివా డెందుండు రా దుర్మతీ
ఇంతకు పూర్వం నా తమ్ముని చంపిపోయాడు వాడు. వాడు విష్ణువేనని తెలుసు నాకు. అయితే వాడెక్కడికి పారిపోయాడో మాత్రం తెలియదు. వాడికోసమెంతగానో గాలించానీ చతుర్దశ భువనాలూ అయితే వాడి జాడనాకెక్కడా కనపడలేదు. మరి నీకెక్కడ కనిపించాడురా అర్భకా.
ఎక్కడ గలడే క్రియనే చక్కటి వర్తించు నెట్టి జాడను వచ్చున్ చక్కడతు నిన్ను విష్ణుని పెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని పగిదిన్
నీకేదో వాడు కూలి ఇచ్చి పొగడించుకొన్నట్టు ప్రేలుతున్నావు. వాడెక్కడ ఉన్నాడెలా ఉన్నాడే రకంగా వచ్చి పోతుంటాడు. ఆ రహస్యం బయట పెట్టమంటాడు. నిజంగా అదేదో రహస్యం తెలుసుకోవాలని వాడి తాపత్రయం.
దానికా అర్భకుడిచ్చిన జవాబు అతిలోకం.
కలడంభోధి గలండు గాలి కలడా కాశంబు నం గుంభినిం గల డగ్నిన్ దిశలం బగళ్ల నిశలన్ - ఖద్యోత చంద్రాత్మలం గల డోంకారము నం ద్రిమూర్తులఁద్రిలింగ వ్యక్తులందతటం గల డీశుండు గలండు తండ్రీ ! వెదకంగా నేలయీయా యెడన్
ఎక్కడంటే అక్కడ ఉన్నవాణ్ణి ఎందుకయ్యా వెతకటం. వెదకినా నీవెక్కడని వెదుకుతావు. ఇక్కడా అక్కడా వెదకబోతావు. ఇక్కడా అక్కడా వెదకితే ఎలా కనిపిస్తుందా తత్త్వం. ఏమి ఎందుకు కనిపించదు. అంతటా ఉన్నాడని మీరే గదా చెబుతున్నారు. అంతటా ఉన్నప్పుడెక్కడ వెతకినా కనిపించాలి గదా. వాస్తవమే. కనిపిస్తుంది. కాని ఆ మేరకే కనిపిస్తుందది. ఎందుకంటే నీవు వెదుకుతున్నది ఎక్కడో ఒకచోట. అది తత్త్వంలో ఏకదేశం. కనుక ఆ మేరకే కనిపిస్తుందది. అంటే ఒక నామమనీ, రూపమనీ క్రియ అనీ విశేషరూపంగా భాసిస్తుంది. అంతేగాని సామాన్య రూపంగా గోచరించదు. సామాన్య రూపమంటే ఏ రూపమూ లేకపోవటమే. సర్వత్రా అన్నప్పుడు రూపమెలా ఉంటుంది. జడమైన ఆకాశానికే లేదే రూపం. శుద్ధ
Page 347