#


Index



నిర్గుణ భక్తులు - ప్రహ్లాదుడు

కుమారుడు. రెండూ రెండుగా భావిస్తున్నాడు హిరణ్యకశిపుడు. అదే సగుణదృష్టిలో ఉండే దౌర్బల్యం. సార్వత్రికమైన బలాన్ని ప్రత్యేకించి తన బలమని భావించటమే ఒక బలహీనత. ఇలాటి బలహీనుడైన బలవంతుడా హిరణ్యుడు. కనుకనే వాడు చేసిన మారణ హోమాలేవీ ఆ బాలుడి మీద పనిచేయలేదు.

  ఇంకా చీవాట్లు పెడుతున్నాడా కుర్రవాడు తండ్రిని.

లోకము లన్నియున్ గడియ లోన జయించిన వాడవింద్రియా నీకము జిత్తమున్ గెలువనేరవు - నిన్ను నిబద్ధుజేయునీ భీకర శత్రులార్వుర బ్రభిన్నుల జేసిన బ్రాణి కోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున జూడుము దానవేశ్వరా

  ఆ లోక మీలోకం జయించానని మాటిమాటికీ గొప్పలు చెప్పుకొంటున్నావు. ఏ లోకమూ జయించబనిలేదు నీలో ఉన్న ఇంద్రియానీకాన్ని జయిస్తే. అంతకన్నా లోపల దాగి ఉన్నాయి మరి అరుఘాతుక మృగాలు. అవి నిన్నెప్పుడో చీల్చి చెండాడుతాయి. ఆ లోపలనే వాటిని నీవు నిర్మూలించగలిగితే నీకీ ప్రపంచంలో ఇక శత్రువే లేడు సుమా. అయితే ఈ సూక్ష్మం తెలుసుకోటానికెంతో నేర్పుకావాలి. అది ఓర్పుతో గాని రాదు. నీకా ఓర్పూ నేర్పూ లేదు మరి. అందుకే ఇంత పెడసరంగా నాతో వాదిస్తున్నావు. ఈ అనవసర వాదం కట్టిపెట్టి

పాలింపుము శేముషి-ను న్మూలింపుము కర్మబంధముల సమదృష్టిన్ చాలింపుము సంసారము - కీలింపుము హృదయమందు కేశవ భక్తిన్ అని అద్భుతమైన సలహా ఇస్తాడు.

  అది వాడి జాజ్వల్యమానంగా మండే కోపాగ్ని కాజ్యం పోసినట్టయింది. అయినా వాడినేమీ చేయలేనని తెలుసు తనకు. తనకిప్పుడు కావలసిందొక్కటే. తాననుకొన్నది నిజమా. వాడు చెప్పేది నిజమా. పెద్ద కుతూహలం పట్టుకొన్నదా రాక్షసుడికి. అందుకే దాని కనుగుణంగా ఇలా ప్రశ్నించాడు.

నా తోడం బ్రతి భాషలాడెదు - జగన్నాథుండ నాకంటె నీ భూత శ్రేణికి రాజు లేడొకడు సంపూర్ణ ప్రభావుండ – మ

Page 346

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు