అంధేం దూదయముల్ మహాబధిర శంఖాధ్మానముల్ ...
హరిభక్తి వర్ణితుల రిక్త వ్యర్ధ సంసారముల్ కమలాక్షు నర్చించు కరములు కరములు.. కంజాక్షునకు గాని కాయంబు కాయమే సంసార జీమూత సంఘంబు
విచ్చునే చక్రి దాస్య ప్రభంజనము లేక అని ఒక ఝంఝా ప్రభంజనంలాగా. మానవ జీవితానికంతటికీ ధ్యేయమొక్క విష్ణుతత్త్వమే. అదే మనం నేర్వదగిన విద్య. ఆ విద్య చెప్పినవాడే గురువది చెప్పించిన వాడే తండ్రి. దాన్ని ఎప్పటికైనా సాధించటానికే మానవుడి కసలీ దేహేంద్రియాదు లేర్పడ్డాయి. ఇవన్నీ దాన్ని చేర్చటానికి కేవలం సాధనాలు. దానికి సాధనాలయినప్పుడే ఇవి చరితార్ధం. లేకుంటే వీటి జన్మ నిరర్ధకం.
ఇలా గుక్క తిప్పుకోకుండా ఉపన్యసిస్తుంటే ఆ తండ్రికి దిక్కు తోచలేదు. ఇదంతా కుమారుడి జన్మాంతరార్జిత సంస్కార ఫలమని తెలియక గురు పుత్రులే తనకు ద్రోహం చేశారని ఆగ్రహిస్తాడు. రజః ప్రకృతి ఏమవుతుంది. ఎలా పోతుంది. "బ్రాహ్మణాకృతివి గాక యధార్ధపు బ్రాహ్మణుడండవే" అని వారిని దూషిస్తే వారు మావల్ల తప్పులేదు మహారాజా ! ఇదంతా మీ కుమారుడికి నైజమనీష మేమేమి చేసిందీ కాదని వాపోతారు. మరి ఒజ్జలు చెప్పని ఈ మతి మజ్జాతుడవైన నీకెలా ఉజ్జాతమయిందని ఆశ్చర్యపోతూ అడుగుతాడా కుర్రవాణ్ణి. తనకు జన్మించిన బాలుడికి తన బుద్ధే రావాలని వాడి ఉద్దేశం. తన బుద్ధే చాలా ఉత్తమమయిందని అది తన కుమారుడి కవశ్యంగా వచ్చి తీరాలని ఇవి రెండూ అవివేకమైన ఊహలే. అలా ఎప్పటికీ జరగదు. ఎవరి జన్మ సంస్కారం వారిదే. కేవలం నిమిత్త మాత్రులే తల్లిదండ్రులు. పైగా తండ్రి అయిన తన జ్ఞానమే అమోఘమని ఎందు కనుకోవాలి. కుమారుడికి కలిగిందే ఉత్కృష్టమైన జ్ఞానం కావచ్చు గదా. ఈ మాత్రం వివేచన లేదా రజోగుణ దూషితుడికి.
అతడడిగిన ప్రశ్నకు బీరు పోకుండా సమాధానమిస్తున్నాడా కుమారుడు.
అచ్చపు జీకటిం బడి గృహవ్రతులై - విషయ ప్రవిష్టులై చచ్చుచు బుట్టుచున్ మరల జర్విత చర్వణులైన వారికిం
Page 338