దిక్కు తోచక “ఎక్కడ నున్నవాడు జగదీశ్వరుడాత్మమ యుండు మాధవుండని” ఆ క్షీరసాగర శయనుణ్ణి శరణువేడుతారు. వారికాయన అభయమిస్తూ “కన్నకొడుకు నెవాడెన్నడు రోషంబున ఆపన్నత నొందించునపుడె పట్టి వధింతును” పొమ్మంటాడు.
చూడండి. రజః ప్రకృతికిది పరాకాష్ఠ. నా అంతవాడు లేడని గర్వించటం నలుగురినీ బాధించటం. కడకు భగవద్భక్తుల నుత్తములను తమ కడుపున బుట్టిన వారిని కూడా హింసించటం. ఇంతకన్నా రాజసమేముంది. అజ్ఞానంలోనే కాదు. విజ్ఞానంలో కూడా అది రాజసమే. మొదట చెప్పినట్టు విజ్ఞాన సంపన్నుడే హిరణ్యకశిపుడు. అది కూడా లౌకికమైనది కాదు. వేదాంత విజ్ఞానమే. అయినప్పటికీ అది సాత్త్వికం గాక రాజసమైనందు మూలాన సగుణంతోనే ఆగిపోయింది. ఆ సగుణం నిర్గుణంగా మారాలంటే రజస్సు నశించి శుద్ధ సత్త్వం చోటు చేసుకోవాలి. అంతవరకూ అందులో కూడా తనకున్నదే గొప్ప విజ్ఞానం, తానిక నేర్చుకోవలసింది తెలుసుకోవలసిందీ ఏదీ లేదని రాజస స్వభావుల ఆగ్రహం. ఆదురాగ్రహంతోనే ఒకనాడు తన కొడుకును చూచి "లభ్యంబైన సురాధి రాజపదమున్ లక్షింపడు సభ్యత్వంబున నున్న వాడబలుడై జాడ్యంబునన్ వీడు, విద్యాభ్యాసంబున గాని తీవ్రమతిగా”డని ఆలోచిస్తాడు. అబలుడూ జడుడూ నటవాడు. వీడు విద్యాభ్యాసం చేయిస్తేగాని వాడికి విద్య పట్టుపడదట. వాడికి వీడు నేర్పించక మునుపే పట్టుపడ్డది ఒక మహావిద్య. ఏమిటిదా విద్య. విశ్వమందు గన్న విన్న యర్ధములందు వస్తు దృష్టి జేసి వాంఛడడు ధరణి నాథ దైత్య తనయుండు హరి పరతంత్రుడై హతాన్యతంత్రుడగుచు
హరిపదాంభోజ యుగ చింతనామృతమున నంతరంగంబు నిండినట్లైన నతడు నిత్య పరిపూర్ణడగుచు నన్నియును మఱచి జడత లేకయు నుండును జడుని భంగి
అంతేకాదు. ఏ ని చేస్తున్నా అదే చింత.
పానీయంబులు ద్రావుచుం గుడుచు చున్ భాషించుచున్ హాసలీ లా నిద్రాదులు సేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత
Page 335