అతనిది. ద్వారపాలకుడి కంతకంటే పయి దృష్టి ఎలా వస్తుంది. లోపల ఉన్న స్వామివారి సగుణ విగ్రహమే కనిపిస్తుంటుంది కంటికి. అది అప్పుడే గాదు. ఇప్పుడు కూడా అదే చూడాలని కోరుకొంటున్నది. అప్పుడు భక్తితో అయితే ఇప్పుడు వైరభక్తితో. అది నిరంతరమూ చూస్తూనే ఉన్నాడు ప్రహ్లాదుడు. చుట్టూ ఉన్న ప్రపంచంలో చూస్తున్నాడు. ప్రపంచా తీతంగానూ చూస్తున్నాడు. ఇందుగల డందులేడని సందేహం లేదతనికి. ఆ సందేహమంతా హిరణ్యకశిపుడికే. సగుణంగా మాత్రమే చూడబోయే సరికి అతడికెక్కడా కనపడటం లేదా తత్త్వం. సగుణం కాబట్టి అంతటా కనిపించదు. ఎక్కడో ఒక చోటనే ఉండాలది. ఎక్కడ ఉందో అది తాను గానకుండా ఎప్పటికైనా దాన్ని భేదించి పట్టుకోవాలని ఆ తండ్రి పట్టుదల.
ఇలాంటి తండ్రి దృష్టికి కొడుకు దృష్టికీ హస్తి మశకాంతరమున్నప్పుడు రెంటికీ ఎలా లంగరందుతుంది. కనుకనే అనుక్షణమూ ఆ ఇద్దరి మధ్య పోరాటం. ఎవరి దారికి వారు ఇతరులను మళ్లించుకోవాలని ఆరాటం. ఈ ఆరాటానికీ పోరాటానికీ ప్రతీకమే ఈ కథ అంతా. కథారంభంలోనే ప్రశ్నిస్తాడసలు పరీక్షిత్తు శుకమహర్షిని.
సమః ప్రియ సుహృ ద్రహ్మన్ భూతానాం భగవాన్ స్వయం ఇంద్రస్యార్ధే కథం దైత్యా స వధీ ద్విషమో యథా
ఇదంతా భగవత్సృష్టే గదా. దేవతలైనా దానవులైనా అంతా ఆయనకు సమానమే. అలాంటప్పుడు దేవకార్యమని పేరు పెట్టుకొని వచ్చి రాక్షసులను నిర్దాక్షిణ్యంగా సంహరించటమేమిటి. ఈ ప్రశ్నకు శుకుడిలా సమాధానమిస్తాడు.
నిర్గుణోపిహ్యజో ఽ వ్యక్తో - భగవాన్ ప్రకృతేః పరః స్వమాయా గుణమావిశ్య - బాధ్య బాధకతాం గతః
ప్రకృతి గుణాల కతీతుడయి కూడా ఆ పరమాత్మ తన మాయాబలంచేత సగుణుడిలాగా కనిపిస్తూ తానే బాధకులైన రాక్షసుల రూపంలోనూ బాధ్యులైన దేవతల రూపంలోనూ కనిపిస్తున్నాడు మనకు. అంతేకాదు. ఈ గుణాలాయనవి గావు. సృష్టి అయిన ఈ దేవదానవాది జాతులవి.
జయకాలేతు సత్త్వస్య - దేవర్షిన్ -రసజా ఽ సురాన్ తమసో యక్ష రక్షాంసి తత్కాలాను గుణో ఽ భజత్
Page 333