కొద్దీ మహాజ్ఞానివి కావచ్చు. తరించవచ్చు. కాని నీవు తరించే లోపల చేతనైనంత వరకూ ఇతరులను కాడా తరింపజేసి పోవాలి. ఇతరులంటే మరలా అయోగ్యులూ అనధికారులూ గాదు. కొంతవరకూ జ్ఞానముండి కూడా పరిపూర్ణ జ్ఞానం లేనివారు. అలాంటివాడే ప్రస్తుతం తన తండ్రి హిరణ్యకశిపుడు. అతడికి జ్ఞానముందిగాని అది పరిపూర్ణం కాదు. పరిపూర్ణం కానంత వరకూ తరించలేడతడు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్టు ముందు తన జనకునికి బోధించాలి తాను. అందుకే అతడు తన మాట విన్నా వినకపోయినా విసుగు చెంది తన్ను బాధించినా హింసించినా వదలలేదు. చెవి నిల్లు కట్టుకొని చెబుతూనే వచ్చాడు. ఈ చెప్పటమే చెప్పి తండ్రిని బాగు చేయాలనే ప్రహ్లాదుడు అతనితో సాగించిన పోరాటం. ఇది పోరాటం కాదు. అతని దృష్టిలో తండ్రి కోసం పడే ఆరాటం. ఎంత ఆరాటమంటే అది. అంత మూఢత్వంలో కూడా హిరణ్యకశిపు డప్పుడప్పుడు తనలో తానే ఆత్మవిచారణ చేసుకోవలసి వచ్చింది.
ఏషమే బహ్వ సాధూక్తో - వధోపాయాశ్చ నిర్మితాః తైసైర్మోఘై రసద్ధర్మై - ర్ముక్తః స్వేనైవ తేజసా
ఈ కుర్రవాణ్ణి నేనెంతగానో కఠినంగా మందలించాను. వినకుంటే వధించటానికి కూడా ఆజ్ఞాపించాను. ఎన్ని విధాల ప్రయత్నించినా వీడు వధ్యుడు కాడు. వీడి తేజస్సే వీణ్ణి కాపాడుతున్నది. "బాలో ప్య జడ ధీరయమ్” బాలుడయి కూడా అచలమైనది వీడి బుద్ధి. “అప్రమేయాను భావోయ మకుతశ్చి ద్భయో 2 మరః” అప్రమేయ ప్రభావుడూ ఆకుతో భయుడూ వీడు. "నూనమేత ద్విరోధేన మృత్యుర్మే భవితానవా” చూడబోతే వీడితో విరోధం మూలంగానే నాకు మరణం సంభవించేట్టున్నది.
కుమారుడితో వైరం వల్ల తనకు మరణం వస్తుందనే చూచాడు గాని అతని బోధ వింటే తాను అమృతత్వాన్నే అందుకోవచ్చు నని అనుకో లేకపోయాడా తండ్రి. తండ్రి మీద కొడుకు ఉపదేశం అంతవరకే పని చేయగలిగింది. మన అర్హతను బట్టే పెద్దలు చేసిన బోధ మనకు ఫలించేది. అధికార తారతమ్యమనేది ఎప్పుడూ ఉంటుంది. హిరణ్యకశిపుడి అధికారమంత వరకే. పరిచ్చిన్నమైన సగుణ దృష్టే
Page 332