ఇలాంటి దర్శనం ప్రహ్లాదుడిది. కారణం అతడు విశుద్ధసత్త్వుడు. సాత్వతుడైన భాగవతుడు. రజస్తమో దోషాలు లవలేశం లేని మహాజ్ఞాని. ఇంచుక మాయ లేక మదినెప్పుడు బాయని భక్తితోడ వర్తించే వాడని భాగవతం వర్ణించిన పరమ భాగవతుడతడే. మరి ఇలాంటి నిర్గుణ నిరుపాధిక జ్ఞానానికి నోచలేదా హిరణ్యకశిపుడు. కారణం అది శుద్ధసత్త్వం వల్ల కలిగింది కాదు. రజోమాత్ర జన్యమైనది. కనుక అది సగుణ భావన వరకే వచ్చి నిలిచిపోయింది. నిర్గుణ జ్ఞానాన్ని గూర్చి మాటాడుతాడు. నిజమే. కాని అది మాటలవరకే. ఆచరణలోకి వచ్చే సరికి అది నిలవదు. మరలా సగుణమే తొంగి చూస్తుంది. మనసా వచసా కర్మణా త్రికరణాలలో ఒకటిగానే ఉంటే అది సగుణం కాదప్పుడు నిర్గుణమే అయి ఉండేది. అలాంటప్పుడిక ప్రహ్లాదుడితో వివాదమేముంది. మరి
అతడితో అనుక్షణమూ జగడం పెట్టుకొన్నాడంటే అది సగుణంలో నుంచి నిర్గుణాని కెదగలేకనే.
దీనిని బట్టి చూస్తే ఇది తండ్రి కొడుకులకు భౌతికంగా ఏర్పడిన కలహంగాదు. సగుణ నిర్గుణ దర్శనాల మధ్య జరిగే పోరాటం. ఒకటి తత్త్వాన్ని తన స్థాయికి దించి పరిచ్ఛిన్నంగా చూడగోరితే మరొకటి తత్త్వమున్న స్థాయికి నీవెదిగి చూడాలని హెచ్చరించేది. ఈ రెండు భావాలకూ కేవలం ప్రతీకలే హిరణ్యకశిపు ప్రహ్లాదులనే పాత్రలు. ఇందులో పయిస్థాయి కెదిగే నేర్పు లేక ఓర్పు కోలుపోయినవాడు హిరణ్యకశిపుడు. కనుకనే తన భావానికి విరుద్ధంగా మాటాడుతున్నాడు ప్రవర్తిస్తున్నాడని కొడుకు మీద అతడికి కోపం. అతడి స్థాయికి తానెదగటానికి బదులు అతడే తన స్థాయికి దిగి రావాలని పట్టుదల. ఇలాటి పట్టుదల రాజస ప్రకృతి ఉన్నవాడికి సహజమే. దాని కనుగుణంగానే నడచిందతని వ్యవహారం.
అయితే ఒక ప్రశ్న. హిరణ్యకశిపుడంటే రజోదూషితుడు కాబట్టి పరిచ్ఛిన్న బుద్ధి అయి అతణ్ణి బాధ పెట్టాడు. మరి ప్రహ్లాదుడలా పరిచ్చిన్నుడు కాక పరిపూర్ణుడైన జ్ఞాని గదా. అతడికి తన తండ్రితో సహా తనతో సహా ఈ సమస్త ప్రపంచమూ ఆత్మస్వరూపమేననే జ్ఞానముంది గదా. అతడే ఇతడితో సర్దుబాటు చేసుకొంటే సరిపోయేది గదా. తండ్రి మూర్ఖుడైతే అంత ఉత్తముడైన కొడుకు కూడా కావటం దేనికి. వాస్తవమే. కానక్కరలేదు. కాగూడదు కూడా మన సిద్ధాంతాన్ని బట్టి. కాని ఇక్కడా ఒక ఆధ్యాత్మిక రహస్యమిమిడి ఉంది. అదేమిటంటే నీవు నీ సుకృత విశేషం
Page 331