అనటం. తెలియని మూఢుడైతే ఇలా మాటలతని నోట రాగలవా. మరి ప్రహ్లాదుడు కూడా అలాంటి విజ్ఞాన సంపన్నుడే గదా. పైగా తన తనయుడే గదా. అలాంటి జ్ఞాని తన కుమారుడుగా జన్మించినందు కింకా ఎంతో ఆనందించవలసింది పోనిచ్చి అతనితో పోరాటానికి సిద్ధం కావటమేమిటి. పైకి చూస్తే ఆశ్చర్యంగానే తోస్తుంది మనకు. కాని భాగవతం దీనికి సమాధాన మెప్పుడో చెప్పింది. మనమది మనసుకు తెచ్చుకోటం లేదు. తెచ్చుకొని చూస్తే ఇందులో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు.
ఏమిటది. అసలీ హిరణ్యాదులెవరు. సాక్షాత్తుగా ఒకప్పుడు వైకుంఠ
ద్వారపాలకులు. సనకాదుల శాపం వల్ల వారికక్కడ నుంచి అధః పతన మేర్పడింది.
అయితే స్వామివారను గ్రహించి వారిని శత్రువులుగా మూడు జన్మలో మిత్రులుగా
బహుజన్మలో ఏది కోరుతారని అడిగితే అంత దీర్ఘకాలమాయన వియోగం భరించలేక
మూడు జన్మల శత్రుత్వాన్నే కోరుకొని వచ్చారు. వారు కృతయుగంలో హిరణ్యాక్ష
హిరణ్యకశిపులు. ఊరక వీరు చేతులు ముడుచుకొని కూచుంటే ఎలాగ.
వరానుగుణంగా వైరం సాధించి తీరాలి. అందుకోస మాయనను రెచ్చగొట్టాలి.
ఏమి చేస్తే రెచ్చిపోతాడాయన. వారికి తెలుసు. సూటిగా ఆయనను నలుగురి ఎదుటా
ఇష్టం వచ్చినట్టు దూషించైనా దూషించాలి. అది ద్వాపరంలో శిశుపాలుడు చేశాడా
పని. పోతే ఆయన ఆత్మీయులనూ, భక్తులనూ పట్టి వేధించనైనా వేధించాలి. అలా
చేసినవాడు త్రేతాయుగంలో రావణుడు. అతడాయన భార్యనే అపహరించి బంధంలో
ఉంచాడు. పోతే కృతయుగంలో ఈ హిరణ్యకశిపుడు. ఇతడాయన కత్యంత ప్రియుడైన
మహాభక్తుణ్ణి పట్టి బాధిస్తాడు. ఇలా బంధించటమో బాధించటమో చేస్తేగాని
వారాయన దృష్టి తమవైపు ఆకర్షించలేరు. ఆగ్రహానికి గురి కాలేరు. తదీయ కోపాగ్నిలో
బడి పరిశుద్ధులై మరలా తమ తమ నెలవులు చేరలేరు. ఈ దృష్టితోనే ప్రస్తుత మీ
హిరణ్యకశిపుడు కూడా ఎంత ఆధ్యాత్మ విశారదుడయినా తన కుఆరుడితో నిరంతర
పోరాటానికి దిగింది. ఇదీ మనమిక్కడ చెప్పుకోదగిన సమాధానం.
అయితే దూరమాలోచిస్తే ఇది కూడా ఒక అర్థవాదమే. ఒక సంకేతమే. కథలన్నీ సంకేతాలనే గదా మొదటనే మనవి చేశాను. దానిని బట్టి అసలు జయ విజయులూ లేరు. సనకస నందనులూ లేరు. శాపమూ లేదు. అనుభవించటమూ లేదు. ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని బోధించటానికి కప్పిన కవచమది. ఏమిటా రహస్యం. జయ
Page 329