#


Index



నిర్గుణ భక్తులు - ప్రహ్లాదుడు

భాగవతంలోనే కనిపిస్తుంది మనకు. హిరణ్యకశిపుని తమ్ముడొకడున్నాడు. హిరణ్యాక్షుడని. వాడి కండ్లకెప్పుడూ ప్రపంచం తప్ప మరేదీ గోచరం కాదు. ఉన్నట్టుండి వాడీ భూమండలాన్నంతా చాపకట్టగా చుట్టి తీసుకుపోతుంటాడు. వాడిని పరమాత్మ వరాహ రూపంతో వెంటాడి వధిస్తాడు. అది విని వాడి తల్లి దితీ అంతః పురకాంతలూ అందరూ పెద్ద పెట్టున ఆక్రందన చేస్తుంటారు. అప్పుడు హిరణ్యకశిపుడు వెళ్లి వారినిలా ఓదారుస్తాడు.

నీరాగార నివిష్ట పాంథుల క్రియన్ నిత్యంబు సంసార సం చారుల్ వత్తురు - కూడి విత్తురు సదా సంగంబులే దొక్కచో శూరుల్ పోయెడి త్రోవ బోయెను భవత్సూ నుండు తల్లీ ! మహా శూరుడాతడు తద్వియోగ మున కున్ శోకింపనీ కేటికిన్

  సర్వజ్ఞుడీశుండు, సర్వాత్ముడ వ్యయుం డమలుండు, సత్యుడనంతుడాఢ్యు డాత్మరూపంబున నశ్రాంతమునుదన మాయా ప్రవర్తన మహిమ వలన గుణముల గల్పించి, గుణ సంగమంబున లింగ శరీరంబు లీలదాల్చి కంపిత జలములో కదలెడి క్రియ దోచుపాదపంబుల భంగి భ్రామ్యమాణ చక్షువుల ధరిత్రి చలితయై కానంగ బడిన భంగి వికల భావ రహితుడాత్మ మయుడు కంపి తాంతరంగంబున గదలినట్ల తోచు గదలకుండు ఈ విధంబున ఈశ్వరుండు లక్షణవంతుండుగా కుండియు లక్షితుండయి కర్మాను సరణంబున జీవులకు యోగ వియోగంబుల నొందించు.

  అని బోధిస్తూ దీనికి తార్కాణగా అతడు ప్రేత బంధుయమ సంవాదమనే ఇతిహాస ముదాహరిస్తాడు తల్లికి. అందులో మరలా ఆ ప్రేతుని బంధువులకు బాల విప్రవేషధరుడయి వచ్చిన యమధర్మరాజు దాహరించిన విహంగమ వ్యాధుల కథ కూడా ఏ కరువు పెడతాడు. ఈ రెండు కథలూ చెప్పిన తరువాత మరలా ఇలా చెబుతూ పోతాడా తల్లికి తమ్ముని భార్యలకు.

పరులెవ్వరు, తామెవ్వరు, పరికింపగ నేక మగుట భావింపరు -త త్పరమ జ్ఞానము లేమిని పరులును నేమనుచు దో చు బ్రాణులకెల్లన్

  ఇవన్నీ ఎవరో గాదు. సాక్షాత్తూ హిరణ్యకశిపుడు పలికిన సుభాషితాలు. ఇంత గొప్ప వేదాంత విజ్ఞానం ఒలకబోసిన హిరణ్యకశిపుడేమీ తెలియని వాడని ఎలా

Page 328

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు