అతని బారికి చిక్కి భయంతో వణుకుతూ ఆక్రందనం చేసే మా తల్లిని చూచాడు. చూచి ఇంద్రా ఈవిడ అనపరాధిని. పరభార్య. పతివ్రత. ఇలాంటి దాన్ని కొనిపోవటం నీ అంతవాడికి ధర్మం కాదు. విడిచి పెట్టమని మందలిస్తాడు. “ఆస్తే 2 స్యాజఠరే వీర్య – మవిషహ్యమ్ సురద్విషః" ఈవిడ గర్భంలో శిశువు పెరుగుతున్నాడు. వాడు జన్మించాడంటే దేవలోకానికితోధికంగా ముప్పు తెచ్చి పెడతాడు. వాణ్ణి ప్రసవించగానే చంపి వేయాలి. అంతదాకా ఈవిడ నా చెరలో ఉండాలంటాడు దేవేంద్రుడు. అందుకు నారదుడు నవ్వి
“సోయం నిషిల్బిషః - సాక్షా - న్మహా భాగవతో మహాన్ నత్వయా ప్రాప్స్యతే సంస్థామ్”
ఆవిడ గర్భవాసంలో పెరిగే శిశువెవరనుకొన్నావు. అతడు నీవనకొన్న రాక్షసుడు కాదు. క్రూరుడు కాదు. ఒక మహాభాగవతుడు. అతడు నీచేత చచ్చేవాడు కాదు. సుమా అని హెచ్చరిస్తాడు.
ఆ హెచ్చరిక విని మనసులోని ఆందోళన విడిచి దేవేంద్రుడు తానూ విష్ణుభక్తుడే గనుక తన కార్యానికది అనుకూలమేనని భావించి ఆవిడను వదలిపెట్టి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్లిపోతాడు. తరువాత నారదుడు మాతల్లిని ఊరడించి తన ఆశ్రమానికి తీసుకెళ్లి ఆవిడ తనకు పరిచర్య చేస్తుంటే సకల ధర్మాలూ, సంసార తారకమైన విజ్ఞానమూ బోధిస్తాడు. ఆ తరువాత అది పెద్ద కాలంబు నాటి వినికి గావున నాడుది యగుటం జేసి పరిపాటి దప్పి సూటిలేక మరచిపోయిందట ఆ తల్లి. తనయుడైన తనకు మాత్రం
వెల్లిగొని నాట నుండియు నుల్లసితంబైన దైవ యోగంబున - శో భిల్లెడు ముని మతమంతయు నుల్లంబున మఱపు పుట్ట దొకనాడైనన్
దైవానుగ్రహం వల్ల ఆ నారద గురూపదేశం అప్పటి నుంచీ మనసుకు పట్టి ఇప్పటికీ మరపురాకుండా మనసులో నాటుకొని పోయిందనీ చాటుతాడు.
చూడబోతే పంచశర ద్వయస్కుడవు బాలుడవని హిరణ్యకశిపుడన్నట్టు అయిదేండ్లు కూడా నిండలేదప్పటికి ప్రహ్లాదుడికి. ఆ వయసులో ఎవరికిగానీ చిన్నతనంలో జరిగిన వృత్తాంతం జ్ఞాపకం ఉండటమే అరుదు. అందులోనూ శైశవం
Page 325