సరే ఎవరినీ సరకు చేయక మనస్సమాన సంచారుడై పోయి ఆ సరోవరాన్ని సమీపించి వెంటనే "కరుణా సింధుడు శౌరి వారి చరమున్ ఖండింపగా బంపె” దేనిని. సుదర్శనచక్రాన్ని. ఎలాంటి చక్రమది. బహువిధ బ్రహ్మాండ భాండచ్ఛటాంతర నిర్వక్రము. ఎక్కడా దాని ధాటికి తిరుగులేదు. సాటిలేని మేటి దివ్యాయుధ మది. స్వామివారు ప్రయోగించటమేమిటి. వెంటనే బయలుదేరట మేమిటి. అంభోజాకర మధ్య నూతన నలిన్యాలింగన ప్రక్రియా రంభుండైన వెలుంగు లేని క్రియ ఆ కొలనులో జొరబాఱి భీమంబై తలద్రుంచి ప్రాణముల బాపిందా మకరమనే పాపిని. వాడూ పాపి గాదు. ఆ మాటకు వస్తే హూహువనే గంధర్వుడు. వాడి కర్మంచాలక ఏదో అపచారం చేసి దేవలుడనే మహర్షి శాపం వల్ల మకరమై జన్మించాడు. శ్రీహరి చక్ర స్పర్శవల్ల శాప విముక్తుడై ఆయనకు భక్తి తాత్పర్యంతో నమస్కరించి తదనుజ్ఞాతుడై తిరిగి నిజరూపం ధరించి తన లోకానికి వెళ్లిపోతాడు. హరిచక్ర స్పర్శచేత గాని దేహబంధం పాయలేదంటే ఆ దేహమెంతో దుర్భేద్యమైనదే కావాలి. హేమక్ష్మాధర దేహమది. అంతేగాక నిస్సీ మోత్సాహము వీత దాహమైనది. శాపప్రభావంచేత సంక్రమించిన బలం గనుకనే ఆ గ్రాహమంతగా విజృంభించింది. పృథు శక్తితో వెయ్యేండ్లు పోరాడినా గజేంద్రు డలసిపోయాడే గాని ఆ గ్రాహం చెక్కు చెదరలేదు. అన్ని ఏనుగులు బాసట ఉండి కూడా దానినేమి చేయలేకపోయాయి. అది చకిత వన్యే భేంద్ర సందోహం. లేకుంటే అంత గొప్ప గజేంద్రుడేమిటి. దానిని జయించలేక పోవటమేమిటి. మహర్షి శాపప్రభావమది. హరి చక్ర స్పర్శవల్ల విముక్తి చెందవలసి ఉన్నదది. ఆ స్పర్శ దానికి కలగాలంటే విష్ణువు ప్రత్యక్షం కావాలి. కావాలంటే ఒక మహాభాగవతుడి కాలు తాన పట్టుకోవాలి. అందుకే పట్టుకొని బాధించాడా గజేంద్రుణ్ణి. దీనివల్ల గజేంద్రుడెంత మహాభక్తుడో మనకు భంగ్యంతరంగా సూచిస్తున్నది భాగవతం.
దుష్టశిక్షణమయింది. ఇక శిష్ట రక్షణ కావలసి ఉంది. దుష్టుని శిక్షించటం మాత్రమే శిష్ట రక్షణకాదు. శిష్టుడికి తరుణోపాయం చూపినప్పుడే అది నిజమైన రక్షణ. అదికూడా వారి వారి అధికార తారతమ్యాన్ని బట్టి. యే యథామాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమని గదా శాస్త్రం. ఇక్కడ గజేంద్రుడి అధికారమేమిటి. అతడు కోరిందేమిటి. ఇంతకు ముందు జన్మలో అయితే అది సగుణం. కాని ఇప్పుడు
Page 321