#


Index



సగుణ నిర్గుణ సంధి - గజేంద్రుడు

ఈక్షణ గోచరుడయింది ఒక్క గజేంద్రుడికే గాదు. గజేంద్రుడిలాంటి పుణ్య జీవులకంతా దర్శనమిచ్చాడు పరమాత్మ.

“విను వీథిం జనుదేర గాంచి రమరుల్ విష్ణున్ - సురారాతి జీ వన సంపత్తి నిరాకరిష్ణు - కరుణా వర్ధిష్ణు - యోగీంద్ర హృ ద్వన వర్తిష్ణు - సహిష్ణు - భక్త జన బృంద ప్రాభవాలంకరి ష్ణు - నవోడోల్లస దిందిరా పరిచ రిష్ణుం జిష్ణు రోచిష్ణునిన్”

  దుష్ట శిక్షణా శిష్ట రక్షణా ఆచరిస్తూ భక్త జన త్రాణ పారీణుడని పేరు గాంచిన ఆ శ్రీమన్నారాయణుడు ముక్కోటి దేవతలకూ పరిచితుడే గదా కనుకనే వారిలో ...

చను దెంచెన్ ఘనుడల్ల వాడె - హరి - పజ్జన్ గంటి రే లక్ష్మి - శం ఖ నినాదం బదె - చక్రమల్లదె భుజంగ ధ్వంసియున్ వాడె - క్ర న్నన నేతెంచె"నని...

  ఒకరి కొకరు చేయి చాపి చూపుతూ దగ్గరకు రాగానే “ఓమ్ నమో నారాయణాయ" అని తిరు మంత్రాన్ని జపిస్తూ వరుసగా నిలిచి ఆయనకు నమస్కరించారు వేల్పులు.

  అది కూడా గమనించలేదా మహానుభావుడు. స్వీకరించను కూడా లేదు. కారణం. కుంజరేంద్ర పాలన పారవశ్యమట. అప్పటికా గజేంద్రుడే ముక్కోటిదేవతల కన్నా మేటి అని అర్థమవుతున్నది. భక్తి మార్గంలో కూడా అంతస్తులున్నాయి. అంతకంత కంతస్తుపెరిగే కొద్దీ పరమాత్మకు సన్నిహితుడవుతాడు సాధకుడు. మిగతా వారనాదరణీయులని గాదు. నమే ద్వేష్యోస్తిన ప్రియః అని పరమాత్మ కెవరూ సరిపడని వారు కారు. ఉదరాస్సర్వ ఏవైతే. అంతా ఉదారచరితులే. అయినా జ్ఞానీత్వాత్మైవమే మతః జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే. ఎందుకని. "ఆస్థిత స్సహిధర్మాత్మా మామే వానుత్తమాం గతిమ్” నన్నే నమ్ముకొని ఉన్నాడతడు. నేను తప్ప సృష్టిలో మరేదీ కనపడటం లేదతనికి. "ప్రియోహి జ్ఞాని నోత్యర్థ మహమ్ - సచ మమ ప్రియః" అతడికి నేను ప్రియుణ్ణి గనుకనే నాకూ అతడంటే ప్రియమని చాటాడు గదా భగవానుడు. అదే ఇక్కడ గజేంద్రుడి వ్యవహారంలో చూపుతున్నాడు.

Page 320

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు