#


Index



సగుణ నిర్గుణ సంధి - గజేంద్రుడు

శాసించేవడెవడు. శాసించబడే దేమిటి. అంతా అబద్ధమే. ఇది ఆయన స్వరూపావస్థ. ఇలాంటి స్వరూపాన్నే భజిస్తానంటాడు గజేంద్రుడు. ఎంత గొప్ప విజ్ఞానంతో పలికిన పలుకులివి.

  అయితే ఎంత పలుకైనా అది పలుకే. జ్ఞానంతోనే పలకవచ్చు. ఆ జ్ఞానానికి వైరాగ్యం తోడుకావాలి. సర్వ సంగ పరిత్యాగమే వైరాగ్యం. "సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకమ్ శరణమ్ ప్రజ” అన్నాడు భగవానుడు. పుణ్యం పాపమనే వివేచన చేయక అన్ని ప్రపంచ ధర్మాలకూ తిలాంజలి ఇవ్వాలి. అది కూడా మనసా, వాచా, కర్మణా అప్పుడే ఆ కలిగిన జ్ఞానం నిష్ఠగా మారుతుంది. ఆ నిష్ఠ ఉన్నప్పుడే "అహమ్ త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి” అని భగవానుడిచ్చిన హామీ ఫలిస్తుంది. ప్రస్తుతం గజేంద్రుడలాంటి శరణా గతి నవలంబిస్తాడు చివరకు. "లావొక్కింతయు లేదు. ధైర్యము విలోలంబయ్యె - ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను" ఇవన్నీ కూడా కాదు. "నీవే తప్ప నితః పరం బెఱుగ" అనే భావం రావాలి మనసుకు. మామేకమ్ అనే సూత్రానికి వ్యాఖ్యానమిది. అంతేకాదు. “ఓ కమలాప్త యోవరద - యోప్రతిపక్ష విపక్ష దూర"
అని సగుణ నిర్గుణాత్మకంగా కూడా ధ్యానించాడా పరతత్త్వాన్ని. ఇర్గుణమైనా అది సగుణ రూపంగా సాక్షాత్కరించగలదు. ఆర్హుడైన తన తాపాన్ని హరించగలదు గదా అని భక్తుడి తాత్పర్యం.

  అలాగే సాక్షాత్కరించిం దది. ఇంత పరాకాష్ఠకు వచ్చి పలవిస్తే ఎలా సాక్షాత్కరించక పోతుంది. తప్పకుండా సాక్షాత్కరిస్తుంది. మరి అలా సాక్షాత్కరించే శక్తి ఆయన కుందంటే అది విశ్వమయుడు గనుకనే ఉండగలిగింది. ఎంత విశ్వాతీతుడో అంత విశ్వమయుడాయన. విశ్వాతిగమైన జ్ఞానంతో ప్రపన్నులైనవారిని విశ్వమయుడై కాపాడుతాడు. తలపడె అన్నందుకు వెంటనే భక్తుడి కడ్డుపడ్డదలచాడు తలచాలంటే ముందు వినాలి గదా. విన్నాడు కూడా. కుయ్యాలించాడు. వినటం తలచటమే గాదు. వేగ రావాలి గదా. వేగంగానే వచ్చాడు కూడా ఎక్కడో వైకుంఠంలో నగరిలో ఆ మూలసౌధంలో-మందార వనం దగ్గరి సిరితో ఏకాంతంగా క్రీడిస్తున్న ఆ హరి

“సిరికిం జెప్పడు - శంఖ చక్ర యుగముం జేదోయి సంధింప డే పరివారంబును జీర డభ్ర గపతిం బన్నింప డా కర్ణికాం

Page 318

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు