#


Index



సగుణ నిర్గుణ సంధి - గజేంద్రుడు

మట్టి నల్లగా గట్టిగా అణురూపంగా ఉన్న ఒకానొక పదార్థం. అది కుండలోనే ఉన్నా కుండ యొక్క గుండ్రని ఆకారమూ కుండ అనే బుద్ధీ మనకున్నంత వరకూ దృష్టికి రాదు. అక్కడే ఉన్నా తాత్కాలికంగా మఱుగుపడి ఉంటుంది. ఆ నామరూపాలు మనసుకు రాకుండా చూస్తే బయటపడి కనిపిస్తుంది. అలాగే ఈ విశ్వమంతా పరచుకొని ఉన్నా అది ఈ విశ్వంలోని నామరూపాలు చూస్తున్నంతదనుకా మనకు మనసుకు రాదు. వీటిని ప్రక్కకు త్రోసి ఆకాశంలాగా సమానంగా పరచుకొని ఉన్న ఒక నిశ్చలమైన పదార్థం లాగా దానినెప్పుడు భావన చేస్తామో అప్పుడే ఈ నామరూపాలన్నీ ఆ సచ్చిద్రూపంగా మనకు దర్శనమిస్తాయి. ఈ ప్రకారంగా ఇవే చివరకా తత్త్వాన్ని పట్టి ఇచ్చాయి కాబట్టి విశ్వం చేతనే వేద్యుడతడు.

  అంతేకాదు. విశ్శు నవిశ్వున్. విశ్వమూ కాదది అవిశ్వమూ కాదట. ఇదేమిటీ గొడవ. అయితే విశ్వమైనా కావాలి లేదా విశ్వం కాకుండానైనా పోవాలి. రెండూ అదే ఎలా అవుతుంది. అవుతుంది. అదే చిత్రం. ఎలాగంటే విశ్వమంతా దాని సృష్టే దాని వివర్తమే కాబట్టి ఆభరణాలన్నీ బంగారే అయినట్టు ఈ విశ్వమంతా అదే. అలాగే ఈ విశ్వమెంత సృష్టి అయినట్టు కనిపించినా ఇది వాస్తవంలో సృష్టే కాలేదు. రాలేదు. ఆది మధ్యాంతాలలో ఉన్నదా ఒకే ఒక చైతన్యం. కాబట్టి అది విశ్వం కానేకాదు. అవిశ్వమే. ఇలా విశ్వమయి కూడా కాని తత్త్వమది. కనుకనే శాశ్వతం. ప్రపంచంలాగా నశ్వరం కాదు. కారణం. అజుడు. జీవిలాగా అది జన్మించింది కాదు. అదే అన్నిటికీ మూలమైనప్పుడెలా జనిస్తుంది. అయితే అజుడు మరొకడున్నాడు గదా అంటే బ్రహ్మ ప్రభు. అజుడంటె బ్రహ్మదేవుడని అర్థమైనా ఆ బ్రహ్మకు కూడా ప్రభుడైన అజుడీయన. దేని నుంచి ప్రభవిస్తాడో అది ప్రభువు. బ్రహ్మ సాక్షాత్తూ ఆయన నాభి నుంచి ప్రభవించిన వాడే. కాబట్టి జుడేగాని అజుడు కాదు. నిజమైన అజుడా పరమాత్మే. ఈశ్వరుడు. తాను జన్మించకుండా తన నుంచి జన్మించే సమస్తానికి ఈశ్వరుడాయన. వీటి స్థితిగతులను నడిపేవాడు. ఇది ఆయన విభూతి దశ. పోతే పరమ పురుషు అలా అన్నింటిలో చేరి అంతర్యామి రూపంగా అన్నింటినీ శాసిస్తూ కూడా పరముడూ పురుషుడూ. అంటే అన్నింటికీ అతీతుడు. కారణం అన్నింటినీ పూరించినవాడు. అంతః పూర్ణమ్ బహిః పూర్ణమన్నట్టు సర్వత్రా పూర్ణమైన తత్త్వమది మరొక పదార్థానికి ఆస్కారం లేదు. అలాంటప్పుడిక

Page 317

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు