గాక తద్విలక్షణమైన చిత్పదార్థం కూడా ఇది. ఇలా సచ్చిదాత్మకమైన తత్త్వమేదో అదీ ఈ కార్యరూపమైన జగత్తుకంతా కారణం. అది మన కదృష్టమైనా దృష్టమైన ఈ కార్యాన్ని బట్టే ఆ కారణాన్ని ఊహించవచ్చు మనం. అది లక్ష్యమైతే ఇది దానికి లక్షణం.
మరి కార్యం కారణమనే సరికివి రెండూ ఎప్పుడూ ఇలా తీర్థానికి తీర్థంగా,
ప్రసాదానికి ప్రసాదంగా విడిపోయి ఉంటాయని మరలా భ్రాంతి పడవచ్చు.
అలాటి అపోహ పెట్టుకోరాదు. సర్వమూ తానయైన వాడట. రెండూ కలిసి ఒక్కటే.
ఒక్కటే అంటే ఇది అది అవుతుందనా లేక అది ఇది అవుతుందనా అని మరలా
సందేహం రావచ్చు. ఇందులో ఏదైనా అది ఒక్కటే. అందుకే చెబుతున్నాడు. “సర్వము
తానయైన" అని. అంటే తాను సర్వమూ కావటం కాదు. మీదు మిక్కిలి ఈ కనిపించే
సర్వమూ తానే అవుతుందట. అంటే జగత్తు ఈశ్వరాకారంగాని, ఈశ్వరుడు
జగదాకారం కాదు. ఈశ్వరుడు జగదకారమనుకొంటే అది ఆభాస. జగత్తు
ఈశ్వరాకారమని భావిస్తేనే అది సత్యం. ఏమి, అదే ఆభాస అయి ఇది సత్యమెందుకు
కారాదు. అనాది మధ్యలయుడెవ్వడని ఈ ప్రశ్నకు జవాబు. ఆది మధ్యాంతాలున్నంత
వరకూ అది తాత్కాలికమే గాని త్రికాలా బాధ్యమైన సత్యం కాదు. సత్యమనేది
ఎప్పుడూ నిరపేక్షం. మరొక దానిమీద ఆధారపడరాదు. ఆది మధ్యాంతాలనే సరికి
వాటి కోస మింకొక దాని నాశ్రయించవలసి వస్తుంది. ప్రపంచాని కిప్పుడాది
మధ్యాంతాలను మనం చూస్తున్నాము. కనుక ఇది తన ఉనికి కోసం మరొక దాని
నాశ్రయిస్తున్నది. ఆ ఆశ్రయమే దీనికి మూల కారణమైన ఈశ్వరచైతన్యం. అది
మరలా ఆది మధ్యాంతాలు కలిగిందైతే మరొక మూల పదార్థాన్ని పట్టుకోవలసి
వస్తుంది. అది ఎక్కడికీ నిలవక అనవస్థా దోషానికి దారి తీస్తుంది. కాబట్టి జగత్తు
కంతా మూలమైన తత్త్వమని ఎప్పుడు పేరు పెట్టామో దానికిక ఆది మధ్యాంతాలు
లేవు. లేకుంటే దీనిలాగా సాపేక్షం కాదు సాపేక్షకం కాకుంటే అది ఇక సత్యమే.
అది సత్యమైతే ఇది దాని కాభాస అని వేరుగా చెప్పనగక్కరలేదు. దాని ఆభాసే
కాబట్టి ఇది దానికన్నా ఇక వేరయిన పదర్ధం కాదు. అంటే కార్యకారణ రూపంగా
ఒకే ఒక చైతన్యం విస్తరించి ఉందన్న మాట. ఎక్కడ ఉందది. ఆత్మభువు. ఆత్మభూః
అనే రూపానికిది తత్సమరూపం. ఆత్మభూ అంటే స్వయంభూ. తన పాటికి తానున్నది
Page 311