మరి అలాంటప్పుడు తన గత వైభవాన్ని స్మరించుకొని బాధపడటం కూడా సహజమే ప్రాణులకు.
నా నానే కప యూథముల్వనము లోనం బెద్ద కాలంబు స న్మానింపం దశ లక్ష కోటి కరిణీ నాథుండనై యుండి – మ ద్దానాంభః పరిపుష్ట చందన లతాంత చ్ఛాయ లందు
హాయిగా ఆనందంగా కాలం గడిపేవాణ్ణి ఈ నీరాశ నన్ను పేరాశ అయి ఇటెందుకు తెచ్చింది. ఎందుకింత భయం వచ్చి నెత్తిన పడింది. ఇది ఎలా తొలగిపోతుందో గదా ఈశ్వరా ! అని వాపోతుంది. ఆ వాపోవటంలో పురాకృత సుకృతం కొద్దీ ఈశ్వరుడి నామం దాని నాలుకమీద అప్రయత్నంగా దొరలింది. వెంటనే ఆత్మజ్ఞానం సహస్రముఖాలుగా ఆవిర్భవించింది మనసులో. ఇక కీర్తించ నారంభించింది. ఏమని.
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యెవ్వని యందు డిందు - పరమేశ్వరుడెవ్వడు - మూలకారణం బెవ్వ డనాది మధ్యలయు డెవ్వడు - సర్వము తానయైన వా డెవ్వడు వాని - నాత్మ భవు నీశ్వరునే శరణంబు వేడెదన్
ఆ ఈశ్వరుడెలాంటి వాడంటే వర్ణిస్తున్నాడు. ఎవడీ ప్రపంచ సృష్టి స్థితి లయాలకు మూడింటికీ కారణభూతుడోవాడట. "జన్మ ద్యస్య యతః" అనే సూత్రన్ని జ్ఞప్తికి తెస్తున్నదీమాట. చరాచర రూపంగా మన చుట్టూ పరచుకొని ఉన్న సర్వ ప్రపంచమూ ఒక కార్యం. దానిపాటికది ఆవిర్భవించలేదిది. దీనికేదో కారణముండి తీరాలి. సమస్తానికీ కారణం కాబట్టి దానికి కారణమంటూ ఉండనేరదు. అందుకే అది మూలకారణం.
అయితే కారణమనే సరికది కుండకు మట్టిలాగా ఆభరణానికి బంగారం లాగా అచేతనమనే ఆశంక కలగవచ్చు. అలా అచేతనం కాదది. సచేతనం. పరమేశ్వరుడంటే అదే అర్థం. అన్నింటినీ ఈశనం చేసేవాడు. వశంలో ఉంచుకొని నడిపేవాడు. అలాంటి ఈశనం చేయాలంటే అచేతనమైన పదార్థం చేయలేదు. పరిపూర్ణమైన చేతన పదార్ధమే చేయగలదు. అప్పటికీ మృదాదులలాగా సత్పదార్ధమే
Page 310