గజేంద్రుడు. ఈ గ్రాహమనేది నిజంగా గ్రాహం కాదు. విధి నా యెడల పన్నిన ఒక పాశం. ఆపాశం నన్ను ఆ పాద మస్తకమూ గట్టిగా చుట్టుకొన్నది. దాని పట్టు విడిపించుకోటం కర్మ పరాధీనుడనైన నా వల్ల కాని పని. అసలు గ్రాహమనే గాదు విధాత పన్నిన పాశం. ఆ మాటకు వస్తే గజ శరీరమనేదే ఒక పెద్ద పాశం. గ్రాహం మనచుట్టూ ఉన్న సంసార పాశమైతే, గజరూపం మనలో లోపల దాగి ఉన్న అహంకారమనే పాశం. శాస్త్ర పరిభాషలో అహంకారమంటే కేవల గర్వమని గాదు. దానికి కారణభూతమైన దేహాత్మాభిమానం. కనిపించే దేహమే నా ఆత్మ లేదా నా స్వరూపం. ఇంతకు మించి నా స్వరూపమెక్కడా లేదని భావించటమే అసలైనా అహంకారం. ఈ అహంకారమే అన్నిటికీ మూలకారణం. కనుకనే దీనికి కారణ శరీరమని పేరు. దీనివల్ల ఏర్పడిందే కళత్ర పుత్రాదుల మీది మమకారం. దానివల్ల వచ్చి నెత్తిన పడ్డవే సాంసారికమైన పీడలన్నీ. శాస్త్ర పరిభాషలో ఉన్న ఈ వ్యవహారమే పురాణ పరిభాషలో సంసార బాధలంటే గ్రాహమనీ, మమకారమంటే దశలక్ష కోటి కరిణీ సాంగత్యమనీ, అహంకారమంటే నేనీ బలగానికంతా నాథుడనైన గజేంద్రుణ్ణి గదా అనీ సంకేత శబ్దాలుగా పరిణమించాయి.
ఇంతకూ దేహాత్మాభిమాన రూపమైన అహంకారమే ఉత్తరోత్తరమైన అన్ని అనర్ధాలకూ మూలకారణం. కాబట్టి ఆ అనర్ధాన్ని పోగొట్టుకోవాలి మొట్టమొదట. అలా పోగొట్టుకోవాలనే అసలు గజేంద్రుడి ఆక్రందన కూడా
జిజీవిషే నా మిహాముయాకిమ్ అంతర్భహిశ్చా 2 వృతయే భయోన్యా | ఇచ్ఛామి కాలేన నయస్య విప్లవః తస్యాత్మ లోకావరణస్య మోక్షణమ్ ॥
ఇది గజేంద్రుడి నోట స్వయంగా వచ్చిన మాట. నేనీ గజ శరీరంతో జీవించాలనే ఇచ్ఛ ఎప్పుడూ లేదు. ఇది నాలోపలా, వెలపలా ప్రతి అణువూ వ్యాపించి నన్ను పెనవేసుకొని ఉన్నది ఈ గజభావం. దీనిని దగ్గర పెట్టుకొని నాకేమి ప్రయోజనం. పెట్టుకొన్నా ఇది ఎంతో కాలముండేది కాదు గదా. ఎంత అభిమానించినా కొంత కాలానికిదీ పోవలసిందే. పోతే కాల ప్రవాహం ధాటికెప్పుడూ దెబ్బ తినక తట్టుకోగల శరీరమేదో అది కావాలని కోరిక నాకు. అది ఇక శరీరమే కాదు. శరీరం కాని శరీరమది. అంటే అశరీరమని పిలువబడే మోక్షమే. అంతవరకూ ఎలాటి దివ్య శరీరం సంపాదించినా ఉపయోగం లేదు. అది ఆత్మచైతన్యాని కొక ఆవరణమై
Page 308