ఆ పరీక్షకిలాంటి జీవన్ముక్తులైన మహర్షులనొక ఆలంబనం చేసుకొని పంపుతాడు. భగవత్సంకల్ప ప్రేరితులై వస్తారు వారు. కాబట్టి తదనురూపంగానే ఉంటాయి వారి మాటలూ, చేష్టలూ. అంబరీషుడి దగ్గరకు దుర్వాసుడు వచ్చాడన్నా, ఇంద్రద్యుమ్నుడి దగ్గరికి అగస్త్యుడు వచ్చాడన్నా, వచ్చి వారిపైన ఆగ్రహించారన్నా అది ఈ దృష్టితో చూడాలి మనం. అది పైకి ఆగ్రహంగా కనిపించినా చివరకు వారి ద్వారా భగవానుడు వారిపట్ల చూపే అనుగ్రహమే గాని వేరుగాదు.
ప్రస్తుత మీ కుంభ సంభవుడు రావటమూ, హడావుడిగా ఆ రాజును శపించి పోవటమూ కూడా ఇలాటి వ్యవహారమే. అనుగ్రహమే ఇది. ఆగ్రహం కాదు. అంత వరకూ సగుణమైన దృష్టితోనే ఉన్నాడా రాజు. ఎంత వైష్ణవుడైనా, ఎంత అచ్యుత ధ్యాననిష్ఠా గరిష్ఠుడైనా, ఆయన దృష్టిలో ఉన్నదొక్క విష్ణువే. అదీ ఏకదేశ నియంత్రితమే. సర్వ జగద్వ్యాప్తమైన తత్త్వం కాదు. అలాంటి తత్త్వాన్ని ఎప్పటికైనా పట్టుకొంటే గాని మోక్ష సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడు కాలేడు. పట్టు తన పాటికి తాను చిక్కించుకోలేక బాధపడుతున్నాడు. కాగ దాని నెలాగైనా ఆయనకు అందివ్వాలని భగవత్సంకల్పం. అయితే అందరి విషయంలో కలగదా సంకల్ప మీశ్వరుడికి. అందులకు తగిన యోగ్యతా, పరిపాకమూ, సాధకుడి కంతకుముందు సిద్ధించి ఉండాలి అదిఉంటేనే ఆయన కరావలంబం మనకు లభించేది. ఇంద్రద్యుమ్నుడికా యోగ్యత దండిగా ఉన్నది. సగుణభక్తిలో పరిపక్వమైన జీవితమాయనది. నిరంతర ధ్యాననిష్ఠా గరిష్ఠుడు. ఎటు వచ్చీ అది తావన్మాత్ర పర్యవసితం గాక విశ్వతో వ్యాప్తమయి దీప్తి వహించాలి. అప్పుడే నిర్గుణంగా మారి అది నిర్వృతిని ప్రసాదించేది. దాని నందుకోటానికి కావలసిన సామగ్రి ఆయనకు సిద్ధమయి ఉన్నదని భావించటంవల్లనే తదనంతర భూమిక ఆయనకు ప్రసాదించాలని సంకల్పం కలిగిందా భగవానుడికి. “దైవమ్ మానుష రూపేణ" అన్నట్టు వెంటనే ఒకానొక శుభముహూర్తంలో పంపాడా కలశ సంభవుణ్ణి. అంచేత శాపం కాదిది. వరప్రసాద మాయన పాలిటికి.
అంత కఠినంగా ఆయన శపించిపోతే అది శాపం కాకపోవటమేమిటి. మానవేంద్రుడుగా జీవించే మహారాజును గజేంద్రయోనిలో జన్మించమని శపించటం శాపం గాక వరమెలా అవుతుంది. నిజమే. పైకి చూస్తే అలాగే భాసిస్తుంది. కాని తిట్టు కాదది. దీవనే. ఎందుకంటే కరీంద్రోత్తమ యోని బుట్టుమని ఇచ్చాడాయన
Page 306