#


Index



సగుణ నిర్గుణ సంధి - గజేంద్రుడు

అయితే జరగటమనేది సర్వ సాధారణమైనా అనుభవించక తప్పనిసరి అయినా దృక్పథంలో తేడా ఉంటుంది మానవులకు. అది పర్వత సర్షపాలకున్నంత తేడా. ఆరి వారి అంతస్తులను బట్టి ఉంటుందది. దానికే అధికార తారతమ్యమని పేరు. మందుడైతే అయ్యో అని కుప్పకూలిపోతాడు. మధ్యముడు మనకిది అపరిహార్యమేమి చేయగలమని అనుభవిస్తాడు. పోతే ఎవడో ఉండుత్తముడైనవాడు. “మనుష్యాణాం సహస్రేషు” అని నూటికి కోటికొకడు అలాంటి ఉత్తమాధికారి. వాడు పోరాడినంతవరకూ పోరాడి ఇక లాభం లేదనుకొన్నప్పుడు నిరాశ చెందటం వరకే గాదు. అంతవరకే అయితే అది ప్రతిలోమచర్య. కేవల ప్రతిలోమం జ్ఞాని లక్షణం కాదు. అనులోమం కూడా అలవడాలి. అలాంటి జ్ఞానమే అలవడిందిప్పుడు గజేంద్రుడికి. జ్ఞానమెప్పుడలవడిందో అప్పుడతనికి వ్యథ లేకుండా పోయింది. ఏమిటా జ్ఞానం. ఎలా అలవడింది ఉన్నట్టుండి అలవడటానికేమిటి నిమిత్తం. పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞానసంపత్తి అని సమాధానమిస్తున్నాడు మహాకవి. జ్ఞానమంటే ఇది మామూలు జ్ఞానం కాదు. దివ్యజ్ఞానం. అదే మానవుడి పాలిటికొక సంపద. ఇలాంటి సంపద చేకూరాలంటే ఎవరికంటే వారికి చేకూరదు. పుణ్యానికి ఫలంగా రావాలది. ఎప్పటిదా పుణ్యం. ఈ జన్మలోదైనా కావచ్చు. లేక ముందు జన్మలలో చేసిందైనా కావచ్చు. ఎప్పుడో ఒకప్పుడు చేసి ఉంటేనే అది ఇప్పుడు ఫలించేది. మంచిగాని, చెడ్డగాని చేసింది ఎక్కడికీ పోదు. దాచిపెట్టుకొన్న సొమ్మది. ఎప్పటికైనా మనకు దక్కవలసిందే. అలాగే దక్కింది గజేంద్రుడికి.

  ఈ గజేంద్రుడిప్పటివాడు కాడు. ఇంతకుముందు నుంచీ ఉన్న జీవుడే. గజంగా జన్మించక ముందతడు ఇంద్రద్యుమ్నుడనే మహారాజు. ఇతెవడీ గజేంద్రుడెందుకిలా పట్టు పడ్డాడని పరీక్షిత్తు అడగకపోయినా అడిగినట్టే భావించి ఇలా అతని పూర్వ వృత్తాంతాన్ని వర్ణిస్తాడు శుకయోగి.

అవనీ నాథ గజేంద్రుడా మకరితో నాలంబు గావించె మున్ ద్రవిడా ధీశు డతండు పుణ్యతము డింద్రద్యుమ్న నాముండు

  ఇంద్రద్యుమ్నుడంటే ఇంద్రుడిలాంటి తేజో విశేషం కలవాడనే కాదు. ఇంద్రుడంటే ఆధ్యాత్మిక పరిభాషలో జీవుడని అర్థం. ద్యుమ్నమంటే ప్రకాశం. ధనం

Page 303

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు