#


Index



సగుణ నిర్గుణ సంధి - గజేంద్రుడు

పిఱుదు చక్కట్ల డగ్గఱి ప్రేమతోడ డాసి మూర్కొని దివికి దొండంబు సాచు వెద వివేకించు - క్రీడించు - విశ్రమించు మత్త మాతంగ మల్లంబు మహిమ తోడ

  చూడండి ఆడ యేనుగులపై దానికెంతటి మమకారమో. అంతేగాదు. సహజమైన వాటి అందచందాలతో పోటీ పడి ఆనందించే వాడా గజేంద్రుడు.

తనకుంభముల పూర్ణతకు డిగ్గి యువతుల-కుచములు పయ్యెద కొంగులీగ తనయాన గంభీరతకు జాల కబలల-యానంబు లందెల నండ గొన గ తన కరశ్రీ గని తలకి బాలల చిఱు -దొడలు మేఖల దీప్తి దోడు పిలువ తనదంతరుచి కోడితరుణులనగవులు ముఖచంద్ర దీప్తుల ముసుగుదిగువ తనదు లావణ్య రూపంబు దలచి చూడ నంజనాభ్రము కపిలాది హరి దిభేంద్ర దయిత లందఱు దన వెంట దగిలి నడవ గుంభివిభుడొప్పె నొప్పుల కుప్పవోలె

  చూడండి. ఇది ఆడు ఏనుగుల వర్ణనా, లేక ఆడువారి వర్ణనా, ఏదయిందీ అర్ధం కానిది. ఏనుగులే అయితే వాటి కాళ్ల కందె లెక్కడివి. పాలిండ్లమీద పయ్యెద లెక్కడివి. మేఖల లెక్కడివి. మెఱుగు లెక్కడివి. ఇదంతా ఒక కల్పన. ఏనుగుల వేషంలో ఉన్న మానవుల వ్యవహారమే ఇది. గజేంద్రుడొక అహంభావి అయిన మానవుడైతే వాడి పరివారమైన పుత్ర మిత్ర కళత్రాది గతమమకారమే ఇదంతా. దీనితో నానాగహన విహరణం చేస్తు మార్గం తప్పాడట గజేంద్రుడు. అంటే సంసార విషయాలే ఆగహనం. అహంకార మమకారాలతో వాటి ననుభవించే కొద్దీ మార్గం తప్పక మరేమవుతాడు మానవుడు. అంతేకాదు. పిపాసా పరాయత్త చిత్తుడు కూడా అవుతాడు. విషయ సుఖాలనుభవించే కొద్దీ అంతకంత కవి నవనవోన్మేషంగా భాసించి తృష్ణ పెంచి మనసు నాకర్షిస్తూ పోతుంది. శబ్ద స్పర్శాదికమైన విషయ

Page 298

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు