భంగ్యంతరంగా చాటుతాడు. అవ్యయమూ అనుత్తమ మంటే అప్పటికి నిరాకారమూ సర్వవ్యాపకమూ సర్వానన్యమైన శుద్ధ చైతన్యమే. అది భాగవతుని స్వరూపమే. తన స్వరూపమే సర్వత్రా పరచుకొన్నట్టు చూడగలగాలి సాధకుడు. అలా చూస్తే అది కర్మగాదు. సమాధిగాదు. భక్తిగాదు. పరాభక్తి లేదా జ్ఞానయోగం.
ఇలాంటి జ్ఞానయోగులైన మహాత్ముల చరిత్రను భాగవతమెక్కడ ఎలా
ప్రతిపాదించిందో ప్రస్తుతం మనం సూక్ష్మేక్షికతో పరిశీలించవలసి ఉంది. ప్రతి
భూమికకూ కొందరు భాగవతుల వృత్తాంతాన్ని మన ముదాహరిస్తూ వచ్చాము.
అలాగే ఈ జ్ఞాన భూమికకు కూడా ఉదాహరణ భూతమైన ఉదంతమీయవలసి
ఉంది. అలాంటిఉదాహరణప్రాయమైన జీవితాలొకటి ప్రహ్లాదుడిదీ మరొకటి
కుచేలుడిదీ. వారు పుట్టగానే సమ్యగ్ జ్ఞాన సంపన్నులైన మహానుభావులు. కాని
అలా జన్మతః గాక జీవిత మధ్యంలో జ్ఞానులైన వారూ లేకపోలేదు. అలాంటి వారు
పూర్వజన్మలో సగుణ యోగాభ్యాసులై తద భ్యాస ఫలంగా ఉత్తర జన్మలో
జ్ఞానోదయమైనవారు. ఇలాటి సగుణనిర్గుణ సంధికి నిదర్శన ప్రాయుడైన వాడే
గజేంద్రుడు. గజేంద్రుడేమిటి మోక్షణమేమిటి. అసలిది వాస్తవమేనా. ఇది వాస్తవంగా
జరిగిందనుకోటాని కాస్కారమే లేదు. ఎందుకంటే అది ఒక గజం గాదు. దానిచుట్టూ
అనేక లక్షల గజాలున్నాయి. దశ లక్ష కోటి కరిణీ నాథుడనని గజేంద్రుడే
మొఱపెడతాడు. పిడి ఏనుగులైనా అవీ ఏనుగులే. అలాంటి ఏనుగుల మధ్య ఒక
ఎనుగు హ్రదంలో ప్రవేశించింది. పూర్తిగా ప్రవేశించను కూడా లేదు. కాలు మాత్రమే
మోపింది నీళ్లలో. వెంటనే ఒక మొసలి వచ్చి వాటేసుకొంది. వేసుకొంటే మాత్రం
గట్టిగా కాలుజాడిస్తే పోయి అవతలపడదా. పైగా మహాబల సంపన్నుడా గజేంద్రుడు.
అన్యాలోకన భీకరుడు. జితా శానేక పానీకుడు. కొండలకైనా తలగనివాడు. అతని
ధాటికి పులుల మొత్తములు కూడా పొదరిండ్లలో దూరేవి. ఘోర భల్లూకములు
కూడా గుహలలో జొరబారేవి. హస్త రంధ్రముల నీరెక్కించి పూరించి వదలితే
చండభ మార్గమంతా నిండిపోయేది. ఇలాంటి గజేంద్రుడేమిటి. ఆ మకరిపట్టు
విడిపించుకోలేకపోవటమేమిటి. అదేమి ఐరావతమా శక్తి వాహనమైన కంఠరవమా,
గట్టిగా పాదంతో మట్టితే చిత్తయి పోవలసింది. పైగా అన్ని లక్షల ఏనుగులు చుట్టూ
ఉన్నాయి అన్నీ కలిసి మర్దిస్తే ఒక్క తునుక మిగులుతుందా. అయినా దాని బారికి
Page 295